Telugu Global
NEWS

రెమ్‌డెసివిర్‌​ దందా.. అసలు సూత్రదారి హెటిరో మేనేజర్​..!

దేశవ్యాప్తంగా రెమ్‌డెసివిర్‌​ దందా జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఆస్పత్రి పాలైన కరోనా బాధితులకు రెమ్‌డెసివిర్‌ బాగా పనిచేస్తుందని ప్రచారం సాగడంతో ప్రస్తుతం ఈ ఇంజెక్షన్​కు డిమాండ్​ పెరిగింది. చాలా ప్రైవేటు ఆస్పత్రులు రెమ్డెసివిర్​ ఇంజెక్షన్​ తెచ్చుకోవాలని కోవిడ్​ బాధితుల కుటుంబసభ్యులకు సూచిస్తున్నాయి. కానీ మెడికల్​ షాపుల్లో వీటికి కొరత ఏర్పడింది. దీంతో బ్లాక్​లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫార్మా కంపెనీల్లో పనిచేసే కొందరు ఈ బ్లాక్​ దందాకు తెరలేపారు. ఇంజెక్షన్లు మందుల షాపుకు చేరకముందే దారి […]

రెమ్‌డెసివిర్‌​ దందా.. అసలు సూత్రదారి హెటిరో మేనేజర్​..!
X

దేశవ్యాప్తంగా రెమ్‌డెసివిర్‌​ దందా జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఆస్పత్రి పాలైన కరోనా బాధితులకు రెమ్‌డెసివిర్‌ బాగా పనిచేస్తుందని ప్రచారం సాగడంతో ప్రస్తుతం ఈ ఇంజెక్షన్​కు డిమాండ్​ పెరిగింది. చాలా ప్రైవేటు ఆస్పత్రులు రెమ్డెసివిర్​ ఇంజెక్షన్​ తెచ్చుకోవాలని కోవిడ్​ బాధితుల కుటుంబసభ్యులకు సూచిస్తున్నాయి.

కానీ మెడికల్​ షాపుల్లో వీటికి కొరత ఏర్పడింది. దీంతో బ్లాక్​లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫార్మా కంపెనీల్లో పనిచేసే కొందరు ఈ బ్లాక్​ దందాకు తెరలేపారు. ఇంజెక్షన్లు మందుల షాపుకు చేరకముందే దారి మళ్లిస్తున్నారు. నాలుగువేల ఇంజెక్షన్​ను లక్షల రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలు విధిలేని పరిస్థితుల్లో ఇంజెక్షన్లు కొనాల్సిన పరిస్థితి నెలకొన్నది.

తాజాగా హెటిరో కంపెనీలో పనిచేసే ఓ మేనేజర్​ ఈ గలీజు దందాకు తెరలేపాడు. కాసులకు కక్కుర్తి పడి నీచానికి ఒడిగట్టాడు. సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా షాకింగ్​ నిజాలు వెలుగుచూశాయి.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన బాలకృష్ణ హైదరాబాద్ హెటిరో కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. హెటిరో కంపెనీలో రెమ్డెసివిర్​ ఇంజెక్షన్లు తయారుచేస్తున్నారు. దీంతో బాలకృష్ణ తన స్నేహితుడు శాఖపాలెం కు చెందిన గణపతి రెడ్డి సాయంతో బ్లాక్​ దందాకు తెరలేపాడు. గణపతి రెడ్డి హైదరాబాద్​లో క్యూల్యాబ్​ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. అతడు బాలకృష్ణ సాయంతో రెమ్డెసివిర్​ ఇంజెక్షన్లు బ్లాక్​కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ముందుగా గణపతిరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈ దందా మొత్తం వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం పోలీసులు హెటిరో మేనేజర్​ బాలకృష్ణ మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. బాలకృష్ణ హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన శ్రీ లక్ష్మీ ఏజెన్సీస్ కి రెమ్డెసివిర్​ ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్నాడు. అక్కడి నుంచి అతని స్నేహితుడు గణపతి రెడ్డి వాటిని తీసుకుంటున్నాడు. గణపతి రెడ్డి కొన్ని ఆస్పత్రుల ముఖ్యులతో సంబంధాలు పెంచుకొని రెమ్డెసివిర్​ దందాకు తెరలేపాడు.

తాజాగా వీరిని నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్​ వ్యాప్తంగా రెమ్డెసివిర్​ దందా జోరుగా సాగుతున్నది. కోవిడ్​ బాధితుల వీక్​నెస్​ను ఆసరాగా తీసుకొని ఈ గలీజు దందా చేస్తున్నారు కొందరు దుర్మార్గులు.

First Published:  11 May 2021 6:24 AM IST
Next Story