ఏపీపై తెలంగాణ ట్రావెల్ బ్యాన్..
ఏపీలో 18గంటల కర్ఫ్యూ పగడ్బందీగా అమలవుతోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఏపీలో వాహనాల రాకపోకలకు అనుమతి ఉంది. ఆ సమయం తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను సైతం ఏపీలోకి అనుమతించడంలేదు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు కొత్త రూల్స్ తెరపైకి తెచ్చింది. పరోక్షంగా ఏపీపై ట్రావెల్ బ్యాన్ విధించింది. ఇప్పటికే ఢిల్లీ కూడా ఇలాంటి నిబంధనలు విధించింది. తాజాగా తెలంగాణ పోలీసులు రాష్ట్ర […]
ఏపీలో 18గంటల కర్ఫ్యూ పగడ్బందీగా అమలవుతోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఏపీలో వాహనాల రాకపోకలకు అనుమతి ఉంది. ఆ సమయం తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను సైతం ఏపీలోకి అనుమతించడంలేదు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు కొత్త రూల్స్ తెరపైకి తెచ్చింది. పరోక్షంగా ఏపీపై ట్రావెల్ బ్యాన్ విధించింది. ఇప్పటికే ఢిల్లీ కూడా ఇలాంటి నిబంధనలు విధించింది. తాజాగా తెలంగాణ పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ వాహనాలను అడ్డుకుంటున్నారు. కరోనా రోగులు ఉన్నారని తెలిసినా, కరోనా లక్షణాలు ఉన్నా, అంబులెన్స్ లలో వస్తున్నా కూడా వెంటనే తిప్పి పంపించేస్తున్నారు.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ఆస్పత్రుల్లో చేరేందుకు సరిహద్దు ప్రాంతాలనుంచి ప్రజలు తెలంగాణకు అంబులెన్స్ లలో వెళ్తున్నారు. అయితే వీరికి అక్కడ సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవనేది తెలంగాణ పోలీసుల వాదన. ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ లేవంటూ తెలంగాణకు వెళ్తున్న కొవిడ్ రోగుల్ని, వారు వెళ్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. జగ్గయ్యపేట, సూర్యాపేటలోని కోదాడ, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ గేట్ వద్ద తెలంగాణ పోలీసులు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. తెలంగాణకు వచ్చే వాహనాల్లో ఉన్నవారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారికి ఎలాంటి లక్షణాలు లేవని తేలితేనే అనుమతిస్తున్నారు. లేకపోతే వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.
పుల్లూరు టోల్ గేట్ వద్ద వాహనాలను ఆపేస్తున్న తెలంగాణ పోలీసులతో ఏపీ పోలీసులు మాట్లాడటంతో కొంతవరకు పరిస్థితి చక్కబడింది. ఆస్పత్రుల హామీతో అంబులెన్స్ లను తెలంగాణలోకి విడిచిపెట్టారు. అయితే అంబులెన్స్ లు, కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని మాత్రం తెలంగాణలోకి విడిచిపెట్టడంలేదు.