Telugu Global
Cinema & Entertainment

బండ్ల-సునీల్ మధ్య రీమేక్ దోబూచులాట

ఓ కోలీవుడ్ సినిమా అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ తెలుగులో దాని రీమేక్ పై ఆసక్తి నెలకొల్పింది. ఆ సినిమానే ‘మండేలా’. కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ డ్రామా సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు కొందరు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. చిన్న సినిమాగా వచ్చి మంచి సందేశంతో అందరినీ ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను తెలుగులో బండ్ల గణేష్ […]

sunil
X

ఓ కోలీవుడ్ సినిమా అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ తెలుగులో దాని రీమేక్ పై ఆసక్తి నెలకొల్పింది. ఆ సినిమానే
‘మండేలా’. కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ డ్రామా సినిమాను
తెలుగులో రీమేక్ చేసేందుకు కొందరు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. చిన్న సినిమాగా వచ్చి
మంచి సందేశంతో అందరినీ ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించేందుకు
కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను తెలుగులో బండ్ల గణేష్ హీరోగా రీమేక్ చేస్తాడని
ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ రీమేక్ కి సునీల్ పేరు తెరపైకి వచ్చింది.

తాజాగా సునీల్ కి ‘మండేలా’ చూపించిన నిర్మాత అనిల్ సుంకర తెలుగులో రీమేక్ చేసేందుకు
సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. AK ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై భారీ డిమాండ్ మధ్య సినిమా
తెలుగు రైట్స్ కొనుగోలు చేశారని తెలుస్తుంది. త్వరలోనే సునీల్ ను హీరోగా పెట్టి ఈ పొలిటికల్ డ్రామాను
తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తీయాలని భావిస్తున్నారట.

అయితే ఈ సినిమా నుండి బండ్ల గణేష్ తప్పుకున్నాడని అందుకే ఆ ప్లేస్ లోకి సునీల్ వచ్చాడని కొన్ని
కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన బండ్ల గణేష్ అసలు ఒప్పుకుంటేనే కదా తప్పుకోవడానికి అంటూ
ట్విట్టర్ లో రిప్లై ఇచ్చాడు. దీంతో ముందు నుండి ఈ రీమేక్ లో అసలు బండ్ల గణేష్ లేడని తెలుస్తుంది.
సో.. అన్నీ అనుకున్నట్టు జరిగితే మండేలా రీమేక్ లో సునీల్ ఫిక్స్ అయినట్టే.

First Published:  10 May 2021 2:41 PM IST
Next Story