కరోనా బారిన పడిన మరో టాలీవుడ్ హీరో
టాలీవుడ్ లో అల్లు అర్జున్ తర్వాత మరో స్టార్ హీరో కరోనా బారిన పడ్డారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. తనకు కరోనా వచ్చిందన్నాడు. “నాకు కరోనా సోకింది. కానీ ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. నేను చాలా బాగున్నాను. అందరం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయాం. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాం. ఈమధ్య కాలంలో నాతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకోమని కోరుతున్నాను.” ఇలా […]
టాలీవుడ్ లో అల్లు అర్జున్ తర్వాత మరో స్టార్ హీరో కరోనా బారిన పడ్డారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా
సోకింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. తనకు కరోనా వచ్చిందన్నాడు.
“నాకు కరోనా సోకింది. కానీ ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. నేను చాలా బాగున్నాను. అందరం
ఐసొలేషన్ లోకి వెళ్లిపోయాం. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాం. ఈమధ్య కాలంలో నాతో టచ్ లోకి వచ్చిన
వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకోమని కోరుతున్నాను.”
ఇలా తనకు కరోనా సోకిన విషయాన్ని బయటపెట్టాడు ఎన్టీఆర్. అయితే తారక్ కు ఎక్కడ కరోనా సోకిందనే
విషయం అంతుచిక్కకుండా ఉంది. ఎందుకంటే.. ఆయన చాన్నాళ్లుగా షూటింగ్స్ లో పాల్గొనడం లేదు.
పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఆయన కోసం వచ్చే గెస్టులు మాత్రం చాలామంది ఉన్నారు.
ప్రతి రోజూ ఎవరో ఒకర్ని కలుస్తూనే ఉన్నాడు ఎన్టీఆర్. ఈ క్రమంలో ఆయనకు వైరస్ సోకి ఉంటుందని
భావిస్తున్నారు.