Telugu Global
Sports

ఐపీఎల్​.. ఖేల్​ ఖతం అయినట్టేనా? ఏమన్నా చాన్స్​ ఉందా?

ఐపీఎల్​.. కోట్ల మంది క్రికెట్​ అభిమానులకు ఇదో పండగ. గత ఏడాది కరోనా ఉండటంతో విదేశాల్లో ఐపీఎల్​ను నిర్వహించారు. ఐపీఎల్ అంటేనే వేలకోట్ల ఆదాయం. ప్రేక్షకుల ఆసక్తి కూడా అదే స్థాయిలో ఉంటుంది. దీంతో ఐపీఎల్​ను ప్రతి ఏడాది నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా మనదేశంలోనే ఐపీఎల్​ నిర్వహించాలని భావించారు. బయోబబుల్​ పద్ధతిలో ప్రారంభించారు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. కొందరు ఆటగాళ్లకు కరోనా సోకింది. వెరసి కరోనా నిరవధికంగా వాయిదా పడింది. అప్పటి నుంచి ఇటు […]

ఐపీఎల్​.. ఖేల్​ ఖతం అయినట్టేనా? ఏమన్నా చాన్స్​ ఉందా?
X

ఐపీఎల్​.. కోట్ల మంది క్రికెట్​ అభిమానులకు ఇదో పండగ. గత ఏడాది కరోనా ఉండటంతో విదేశాల్లో ఐపీఎల్​ను నిర్వహించారు. ఐపీఎల్ అంటేనే వేలకోట్ల ఆదాయం. ప్రేక్షకుల ఆసక్తి కూడా అదే స్థాయిలో ఉంటుంది. దీంతో ఐపీఎల్​ను ప్రతి ఏడాది నిర్వహిస్తుంటారు.

ఈ ఏడాది కూడా మనదేశంలోనే ఐపీఎల్​ నిర్వహించాలని భావించారు. బయోబబుల్​ పద్ధతిలో ప్రారంభించారు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. కొందరు ఆటగాళ్లకు కరోనా సోకింది. వెరసి కరోనా నిరవధికంగా వాయిదా పడింది.

అప్పటి నుంచి ఇటు క్రికెట్​ అభిమానులు, అటు ప్రాంచైజీల్లో ఒకటే టెన్షన్​. ఇంతకీ ఐపీఎల్​ నిర్వహిస్తారా? లేదా? అని. విదేశాల్లో ఐపీఎల్​ నిర్వహించే అవకాశం ఉందని.. అందుకు సంబంధించిన సాధ్యసాధ్యాలను బీసీసీఐ పరిశీలిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అసలు ఐపీఎల్​ కొనసాగిస్తారా? లేదా అన్న డౌట్​ నెలకొన్నది.

మరోవైపు మనదేశంలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు నిస్సహాయ స్థితిలోకి జారుకున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ మీడియా భారత ప్రభుత్వ పనితీరును ఏకి పారేస్తున్నది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ వైఫల్యమేనంటూ విమర్శలు గుప్పిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్​డౌన్​ విధించారు. మరోవైపు ఆక్సిజన్​ దొరకక.. బెడ్లు అందక రోజుకు పదుల సంఖ్యలో కరోనా బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో ఐపీఎల్​ మనదేశంలో నిర్వహించడం అసాధ్యమే. కానీ విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ మాట్లాడుతూ.. ’ఐపీఎల్​ నిర్వహణపై మాట్లాడటానికి ఇది సమయమని నేను భావించడం లేదు’ అంటూ నర్మ గర్భ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏడాది జూలైలో మాత్రం భారత జట్టు శ్రీలంక లో పర్యటించి మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొంటుందని ఆయన తెలిపారు. ఐపీఎల్​ విషయంపై ఇప్పుడే తాను ఏమీ మాట్లాడలేనని ఆయన పేర్కొన్నారు.

న్యూజిలాండ్‌తో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు భారత బృందం జూన్‌ 2న ఇంగ్లండ్‌కు బయలుదేరనుంది. ఐపీఎల్​లో ఇంకా 31 మ్యాచులు జరగవలసి ఉన్నది. ఒకవేళ ఐపీఎల్​ను రద్దు చేస్తే అధికారికంగానే దాదాపు రూ. 2500 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్​ నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ప్రాంచైజీలు కూడా ఆ దిశగానే ఒత్తిడి చేస్తున్నాయి. ఇక బీసీసీఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

First Published:  10 May 2021 5:44 AM IST
Next Story