Telugu Global
NEWS

వైశ్యులకు కరోనా ముప్పు అధికం.. ఎందుకంటే..?

గుండె ఆపరేషన్ లేదా ఇంకేదైనా మేజర్ ఆపరేషన్ చేసే ముందు కొన్ని ప్రాంతాల్లో రోగి సామాజిక వర్గం ఏంటనేది కూడా వైద్యులు ఆరా తీస్తారు. వైశ్యులకు ఆపరేషన్ చేయాల్సి వస్తే.. మత్తుమందు మోతాదు తగ్గించి ఇస్తారు. దీనికి కారణం బ్యుటైరల్ కొలినెస్టరేస్. వైశ్యుల జీవన విధానం, వారి శరీర తత్వం ఆధారంగా వారికి బ్యుటైరల్ కొలినెస్టరేస్ అనే ప్రత్యేక లక్షణం ఉంటుందని వైద్యులు నిర్ధారించారు. అంటే ఆపరేషన్ల సమయంలో మిగిలినవారికి ఇచ్చినట్టు అదే మోతాదు మత్తుమందుని వైశ్యులకు […]

వైశ్యులకు కరోనా ముప్పు అధికం.. ఎందుకంటే..?
X

గుండె ఆపరేషన్ లేదా ఇంకేదైనా మేజర్ ఆపరేషన్ చేసే ముందు కొన్ని ప్రాంతాల్లో రోగి సామాజిక వర్గం ఏంటనేది కూడా వైద్యులు ఆరా తీస్తారు. వైశ్యులకు ఆపరేషన్ చేయాల్సి వస్తే.. మత్తుమందు మోతాదు తగ్గించి ఇస్తారు. దీనికి కారణం బ్యుటైరల్ కొలినెస్టరేస్. వైశ్యుల జీవన విధానం, వారి శరీర తత్వం ఆధారంగా వారికి బ్యుటైరల్ కొలినెస్టరేస్ అనే ప్రత్యేక లక్షణం ఉంటుందని వైద్యులు నిర్ధారించారు. అంటే ఆపరేషన్ల సమయంలో మిగిలినవారికి ఇచ్చినట్టు అదే మోతాదు మత్తుమందుని వైశ్యులకు ఇవ్వడం చాలా ప్రమాదకరం. తక్కువడోసు అనస్థీషియా ఇస్తేనే వారిలో అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. శ్వాసప్రక్రియను ఇబ్బంది పెడుతుంది. అందుకే ఆపరేషన్ల సమయంలో వైద్యులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు సైతం గతంలో ఈ విషయంపై పరిశోధన చేసి, వైశ్యులలో బ్యుటైరల్ కొలినెస్టరేస్ ప్రభావం మిగతా వారితో పోల్చి చూస్తే వందశాతం ఎక్కువగా ఉంటుందని తేల్చారు.

కరోనా ముప్పు కూడా వారికే అధికం..
ప్రస్తుతం కరోనా వైరస్ ముప్పు కూడా వైశ్యులకే అధికం అని కొన్ని ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. 108 తరాలుగా వైశ్యులు.. వివాహ సంబంధాల విషయంలో అదే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, రక్తసంబంధీకులు లేదా బంధువులతోనే వివాహ బంధాలు ఏర్పరచుకుంటున్నారని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ దశలో వారి జన్యుపరిణామం.. కొన్ని రకాల వ్యాధుల్ని తట్టుకోడానికి సిద్ధం కాలేదు. వారసత్వంగా వచ్చే వ్యాధుల ముప్పు వారిలో అధికంగా కనపడుతోంది. ఇదే సమయంలో కరోనా కూడా వైశ్య సామాజిక వర్గంపై తీవ్ర ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ మ్యుటేషన్లు కూడా వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. కరోనా సోకిన వైశ్యులలో దాదాపు 50శాతం మంది తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని ప్రముఖ వైద్యులు డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం చెబుతున్నారు. మరణాల రేటు కూడా మిగతావారికంటే ఎక్కువగా ఉందని, దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే నెల్లూరు జిల్లాలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు ముగ్గురు కరోనాతో చనిపోయారు. దీంతో మిగతావారంతా భయంతో షాపులు మూసివేశారు. కరోనా కర్ఫ్యూ సమయంలో కూడా షాపులు తీసి ఉంచడం, వినియోగదారులతో జరిపే లావాదేవీలు వ్యాపార వర్గంలో ఉన్న వైశ్యులకు వైరస్ ముప్పుని మరింత పెంచాయి.

కస్టమర్ల అవసరాలను బట్టి.. ఉదయాన్నే షాపులోకి రావడం.. మధ్యాహ్నం వరకు నిలబడో, లేదా కూర్చునో పనిచేయడం. భోజనం చేశాక విశ్రాంతి లేకుండా తిరిగి రాత్రి వరకు షాపులోనే ఉండటం.. ఇలా వ్యాయామం అనేది ఎరగకుకండా వైశ్య సామాజిక వర్గం ఇబ్బంది పడుతోంది. రోజువారీ పనులే తమను వ్యాయామం నుంచి దూరం చేశాయని, రాబోయే తరాలైనా.. ముందు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నాటితరం వైశ్య ప్రముఖులు. జాతి, కుల, మత, వయో భేదాలు లేకుండా అందరినీ కబళిస్తున్న కరోనా.. వైశ్య వర్గంపై కాస్త ఎక్కువ ప్రభావం చూపడం ఆందోళనకర విషయం.

First Published:  10 May 2021 2:45 AM IST
Next Story