ఫ్లాప్ దర్శకుడితో నితిన్ సినిమా
ప్రస్తుతం దర్శకుడు ఎవరనేది చూడ్డం లేదు నితిన్. కేవలం కొత్త కథలు చేయాలనే టార్గెట్ తో ఉన్నాడు. అందుకే చెక్ లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా వెనక్కు తగ్గడం లేదు. మ్యాస్ట్రో లాంటి ప్రయోగాలు చేస్తున్నాడు. ఇప్పుడిదే కోవలో మరో ప్రయోగాత్మక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ హీరో. రీసెంట్ గా వక్కంతం వంశీ, నితిన్ మధ్య స్టోరీ డిస్కషన్లు జరిగాయి. విభిన్నమైన కథలు రాయడంలో వక్కంతం స్పెషలిస్ట్ అనే సంగతి తెలిసిందే. నితిన్ కు […]
ప్రస్తుతం దర్శకుడు ఎవరనేది చూడ్డం లేదు నితిన్. కేవలం కొత్త కథలు చేయాలనే టార్గెట్ తో ఉన్నాడు.
అందుకే చెక్ లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా వెనక్కు తగ్గడం లేదు. మ్యాస్ట్రో లాంటి ప్రయోగాలు
చేస్తున్నాడు. ఇప్పుడిదే కోవలో మరో ప్రయోగాత్మక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ హీరో.
రీసెంట్ గా వక్కంతం వంశీ, నితిన్ మధ్య స్టోరీ డిస్కషన్లు జరిగాయి. విభిన్నమైన కథలు రాయడంలో
వక్కంతం స్పెషలిస్ట్ అనే సంగతి తెలిసిందే. నితిన్ కు కూడా అలాంటి డిఫరెంట్ స్టోరీనే నెరేట్ చేశాడు.
పైగా ఇప్పుడు వక్కంతం చాలా కసి మీద ఉన్నాడు. దీనికి ఓ రీజన్ ఉంది.
చాన్నాళ్లుగా దర్శకుడు అవ్వాలని కలలుకన్నాడు వక్కంతం. ఎన్టీఆర్ తో ప్రాజెక్టు ఫైనల్ అయి మరీ
ఆగిపోయింది. చివరికి బన్నీ హీరోగా నా పేరు సూర్య సినిమా తీసి దర్శకుడయ్యాడు. డైరక్టర్ గా మారాడు
కానీ సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆ సినిమా దెబ్బతో వక్కంతంకు మళ్లీ లాంగ్ గ్యాప్ వచ్చేసింది. నితిన్
తో సక్సెస్ కొట్టి ఆ గ్యాప్ ను భర్తీ చేసుకోవాలనుకుంటున్నాడు వక్కంతం. ప్రాజెక్టుపై త్వరలోనే ప్రకటన
వచ్చేలా ఉంది.