Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమా ఓటీటీలోకి వస్తోందా?

థియేటర్లు మూతపడ్డంతో సినిమాలన్నీ మరోసారి ఓటీటీ ముందు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా మంచి డీల్ వస్తే తన సినిమాను కూడా ఓటీటీకి డైరక్ట్ రిలీజ్ కింద ఇచ్చేయడానికి ట్రై చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. కొండపొలం అనే నవల ఆధారంగా సినిమా తీశాడు క్రిష్. ఈ సినిమాకు అతడే దర్శకుడు-నిర్మాత. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఇందులో హీరోగా నటించగా.. రకుల్ ప్రీత్ హీరోయిన్ […]

ఆ సినిమా ఓటీటీలోకి వస్తోందా?
X

థియేటర్లు మూతపడ్డంతో సినిమాలన్నీ మరోసారి ఓటీటీ ముందు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా మంచి డీల్ వస్తే తన సినిమాను కూడా ఓటీటీకి డైరక్ట్ రిలీజ్ కింద ఇచ్చేయడానికి ట్రై చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.

కొండపొలం అనే నవల ఆధారంగా సినిమా తీశాడు క్రిష్. ఈ సినిమాకు అతడే దర్శకుడు-నిర్మాత. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఇందులో హీరోగా నటించగా.. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది. గతేడాది లాక్ డౌన్ టైమ్ లో తీసిన ఈ సినిమా, ఇప్పుడు రెడీ అయింది.

అయితే మరోసారి కరోనా సంక్షోభం పట్టిపీడిస్తున్న వేళ.. థియేటర్లలో రిలీజ్ వరకు ఆగకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాడు క్రిష్. ఈ మేరకు ఆహా యాప్ నుంచి క్రిష్ కు 15 కోట్ల రూపాయల ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్రిష్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నాడు.

First Published:  8 May 2021 2:22 PM IST
Next Story