దూసుకొస్తున్న చైనా రాకెట్ ఏ దేశంపై పడుతుందంటే..
గత కొంతకాలంగా చైనా చేసిన ఓ పని అందరినీ భయపెడుతోంది. చైనా తన సొంత స్పేస్‌స్టేషన్ కోసం ఏప్రిల్ 29 రోజున లాంగ్ మార్చ్ 5బి అనే రాకెట్ ను అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ రాకెట్ కు చెందిన భారీ శకలం తన నియంత్రణను కోల్పోయి భూమి వైపుగా దూసుకొని వస్తోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో ఇది ఏ దేశంలో ఏ ఊరిపై పడుతుందో అని అందరూ భయపడతున్నారు. ఇంతకీ అది ఎక్కడ […]
గత కొంతకాలంగా చైనా చేసిన ఓ పని అందరినీ భయపెడుతోంది. చైనా తన సొంత స్పేస్‌స్టేషన్ కోసం ఏప్రిల్ 29 రోజున లాంగ్ మార్చ్ 5బి అనే రాకెట్ ను అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ రాకెట్ కు చెందిన భారీ శకలం తన నియంత్రణను కోల్పోయి భూమి వైపుగా దూసుకొని వస్తోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో ఇది ఏ దేశంలో ఏ ఊరిపై పడుతుందో అని అందరూ భయపడతున్నారు. ఇంతకీ అది ఎక్కడ పడే అవకాశం ఉందంటే..
అంతరిక్షం నుంచి రాకెట్లు శకలాలు తరుచూ భూమిపైకి దూసుకొస్తుంటాయి. అయితే వాటిలో అన్నీ సముద్రాల ఉపరితలంపై పడే విధంగా శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇది నియంత్రణ కోల్పోయి, భూవాతావరణంలోకి వస్తుండడంతో దీనిపై ఎవరికీ కంట్రోల్ లేదు. భారీ సైజులో ఉండే రాకెట్ శకలాలు భూమిపై జనావాసంలో పడితే ఎంతో కొంత ప్రాణనష్టం జరగక మానదు.
భూమిపై పడనున్న చైనా రాకెట్ శకలం సుమారు 20,000 కేజీల బరువును, 30 మీటర్ల పొడవును కలిగి ఉంది. అలాగే ఈ రాకెట్ శకలాలు మే 8న రాత్రి 7.30 నుంచి మే 10 అర్ధరాత్రి 1.00 గంటల మధ్య పడే అవకాశముందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రాకెట్ ఉత్తర అమెరికా, దక్షిణ ఐరోపా, చైనా గుండా 41.5 డిగ్రీల అక్షాంశాలకు ఉత్తరంగా, 41.5 డిగ్రీల అక్షాంశాలకు దక్షిణంగా ఉన్న సౌత్ అమెరికా, ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో పడనున్నట్లు అంచనా వేస్తున్నారు. మధ్యలో చైనా, ఇండియాపై పడే అవకాశాలు కూడా ఉన్నాయన్న వార్తలు కొన్ని వచ్చాయి. కానీ సైంటిస్టుల అంచనా ప్రకారం సౌత్ అమెరికా, న్యూజిల్యాండ్, ఆఫ్రికాలో పడే అవకాశాలు ఎక్కువని తెలుస్తోంది.