చిరంజీవికి తొలి పాట పాడిన సింగర్
ప్రముఖ సినీ గాయకుడు జి.ఆనంద్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతూ, నిన్న రాత్రి ఆయన కన్నుమూశారు. ఆనంద్ లేని లోటు పూడ్చలేనిదంటూ టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అయితే ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెడుతూ.. ఆనంద్ కు నివాళులు అర్పించారు హీరో చిరంజీవి. చిరంజీవి తన కెరీర్ లో డాన్స్ చేసిన మొట్టమొదటి పాటను ఆలపించిన వ్యక్తి జి.ఆనంద్. చిరంజీవి నటించిన పునాదిరాళ్లు సినిమాకు జి.ఆనంద్ పాడారు. అలా ఆనంద్ […]
ప్రముఖ సినీ గాయకుడు జి.ఆనంద్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతూ, నిన్న రాత్రి ఆయన కన్నుమూశారు. ఆనంద్ లేని లోటు పూడ్చలేనిదంటూ టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అయితే ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెడుతూ.. ఆనంద్ కు నివాళులు అర్పించారు హీరో చిరంజీవి.
చిరంజీవి తన కెరీర్ లో డాన్స్ చేసిన మొట్టమొదటి పాటను ఆలపించిన వ్యక్తి జి.ఆనంద్. చిరంజీవి నటించిన పునాదిరాళ్లు సినిమాకు జి.ఆనంద్ పాడారు. అలా ఆనంద్ అంటే తనకు ప్రత్యేక అభిమానం అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. ఆ తర్వాత కూడా చిరంజీవి కెరీర్ ప్రారంభంలో వచ్చిన చాలా సినిమాల్లో ఆనంద్ గాత్రం వినొచ్చు.