ఓటీటీ యాప్ పెట్టిన నమిత
నమిత ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. ఆమె చేయడం లేదు అనే కంటే, ఆమెకు ఎవ్వరూ అవకాశం ఇవ్వడం లేదని చెప్పడం కరెక్ట్. ఆమధ్య 2 సినిమాలు చేస్తూ, రెండూ మార్కెట్ అవ్వక ఆగిపోయాయి. ప్రస్తుతం నమిత రేంజ్ ఇది. దీంతో ఆమెకు అవకాశాలిచ్చేవాళ్లు కరువయ్యారు. అటు నమిత కూడా అవకాశాల కోసం ఎదురుచూడ్డం లేదు. పెళ్లి చేసుకొని సెటిలైన ఈ ముద్దుగుమ్మ, పొలిటికల్ గా యాక్టివ్ అవ్వాలని చూస్తోంది. అలా అని కోలీవుడ్ నుంచి దూరంగా […]
నమిత ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. ఆమె చేయడం లేదు అనే కంటే, ఆమెకు ఎవ్వరూ అవకాశం
ఇవ్వడం లేదని చెప్పడం కరెక్ట్. ఆమధ్య 2 సినిమాలు చేస్తూ, రెండూ మార్కెట్ అవ్వక ఆగిపోయాయి.
ప్రస్తుతం నమిత రేంజ్ ఇది. దీంతో ఆమెకు అవకాశాలిచ్చేవాళ్లు కరువయ్యారు.
అటు నమిత కూడా అవకాశాల కోసం ఎదురుచూడ్డం లేదు. పెళ్లి చేసుకొని సెటిలైన ఈ ముద్దుగుమ్మ,
పొలిటికల్ గా యాక్టివ్ అవ్వాలని చూస్తోంది. అలా అని కోలీవుడ్ నుంచి దూరంగా జరగాలని కూడా ఈమెకు
లేదు. అందుకే బాగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకుంది నమిత.
కొత్త ఓటీటీ యాప్ ను స్థాపించింది నమిత. దీని పేరు నమిత థియేటర్. ఈ యాప్ లో చిన్న నిర్మాతలు,
కొత్త దర్శకులకు చోటిస్తానని చెబుతోంది. ఎవరైనా మంచి కంటెంట్ తో వస్తే, దాన్ని తన యాప్ లో
పెట్టుకోవచ్చని చెబుతోంది. దీనికి ఆమె ఓ సరికొత్త బిజినెస్ మోడల్ తెరపైకి తీసుకొచ్చింది. నమిత
ప్రారంభించిన ఈ కొత్త వ్యాపారం ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి