కరోనా వైద్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
కరోనా వైద్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆరోగ్యశ్రీ అమలవుతున్న ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులు ఎంతమంది వచ్చినా బెడ్ లు కేటాయించాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రతి ఆస్పత్రిలోనూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండాలని చెప్పారాయన. బెడ్లు లేవు అనే కారణంతో ఎవరినీ వెనక్కి తిప్పి పంపించొద్దని ఆదేశాలిచ్చారు. ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు కరోనా బాధితులకు కేటాయించాలన్న సీఎం, అంత కంటే ఎక్కువ మంది బాధితులు వచ్చినా […]
కరోనా వైద్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆరోగ్యశ్రీ అమలవుతున్న ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులు ఎంతమంది వచ్చినా బెడ్ లు కేటాయించాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రతి ఆస్పత్రిలోనూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండాలని చెప్పారాయన. బెడ్లు లేవు అనే కారణంతో ఎవరినీ వెనక్కి తిప్పి పంపించొద్దని ఆదేశాలిచ్చారు. ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు కరోనా బాధితులకు కేటాయించాలన్న సీఎం, అంత కంటే ఎక్కువ మంది బాధితులు వచ్చినా వ్యాధి తీవ్రతనుబట్టి తప్పనిసరిగా ఇన్ పేషెంట్లుగా చేర్చుకుని వైద్యం అందించాలన్నారు. జిల్లా కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్ ఎంప్యానెల్ ఆస్పత్రుల్లోనూ కోవిడ్ రోగులకు బెడ్ లు ఇవ్వాలని.. అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్ చేయాలని అధికారులను ఆదేశించారు. తాత్కాలిక ఎంప్యానెల్ ఆస్పత్రుల్లోనూ 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ రోగులకోసం కేటాయించాలని చెప్పారు. కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలన్నారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ పై వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం జగన్ కీలక ఆదేశాలిచ్చారు.
కోవిడ్ ఆస్పత్రుల వద్దే కరోనా కేర్ సెంటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. అవసరమైతే ఆయా ఆస్పత్రుల వైద్యులే కోవిడ్ కేర్ కేంద్రాల్లో సేవలందించాలని చెప్పారు. కరోనా ఆస్పత్రుల్లో నాణ్యమైన భోజనం, పరిశుభ్రత, ఆక్సిజన్, మెడికల్ కేర్, వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. వైద్యుల సంఖ్య తక్కవయితే తాత్కాలికంగా నియామకాలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగాలను ఆదేశించారు. ఆక్సిజన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసే కేటాయింపులు సహా ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఏపీకి ప్రతి రోజూ 500 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని, సరఫరా, నిల్వ అంశాలపై అధికారులు దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.
104 కాల్ సెంటర్‌కు ఫోన్ వస్తే, ఆ రోగి ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఆ జిల్లాకు మెసేజ్ వెళ్తుందని, వెంటనే కలెక్టర్, జిల్లా యంత్రాంగం స్పందించి, ఆయా ఆస్పత్రులలో రోగులను చేర్పించాలని సూచించారు. ఏ ఆస్పత్రి కూడా రోగుల నుంచి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా చూడాలని, కోవిడ్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని చెప్పారు.