Telugu Global
NEWS

ఏపీలో వైరస్ వేరియంట్ పై క్లారిటీ..

ఏపీలో కరోనా కొత్తరకం వైరస్ వ్యాప్తి చెందిందని, కర్నూలు జిల్లాలో ఈ వేరియంట్ బయటపడిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వైరస్ వేరియంట్ పై క్లారిటీ ఇచ్చింది. ఏపీలో కొత్త వైరస్ ఉందంటూ చంద్రబాబు అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పేర్ని నాని. కరోనా వైరస్ కంటే చంద్రబాబే అత్యంత ప్రమాదకారి అని విమర్శించారాయన. ఏపీలో ఎన్‌440కే వైరస్‌ పై ఎలాంటి నిర్ధారణ జరగలేదని, మన దేశంలో […]

ఏపీలో వైరస్ వేరియంట్ పై క్లారిటీ..
X

ఏపీలో కరోనా కొత్తరకం వైరస్ వ్యాప్తి చెందిందని, కర్నూలు జిల్లాలో ఈ వేరియంట్ బయటపడిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వైరస్ వేరియంట్ పై క్లారిటీ ఇచ్చింది. ఏపీలో కొత్త వైరస్ ఉందంటూ చంద్రబాబు అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పేర్ని నాని. కరోనా వైరస్ కంటే చంద్రబాబే అత్యంత ప్రమాదకారి అని విమర్శించారాయన. ఏపీలో ఎన్‌440కే వైరస్‌ పై ఎలాంటి నిర్ధారణ జరగలేదని, మన దేశంలో బి 167 మినహా కొత్త రకం వైరస్‌ ఎక్కడా లేదని స్పష్టం చేశారు.

“సీఎం జగన్‌ అన్ని శక్తులను ఒడ్డి కరోనాకు ఎదుర్కొంటుంటే.. చంద్రబాబు మాత్రం తన కొడుకు భవిష్యత్తు కోసం కరోనా సమయంలోనూ రాజకీయాలు చేస్తున్నారు. బయట రాష్ట్రాల ముందు మన రాష్ట్రం పరువు తీస్తున్నారు. చంద్రబాబుకు ఈ రాష్ట్రంపై ఎందుకీ కక్ష.? కొడుకు భవిష్యత్తు కోసం ఇంత దిగజారాలా? ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఇలాంటి రొచ్చు రాజకీయాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీగా ఉండటం ముఖ్యమా..? ఖాళీ బెడ్స్ ఎప్పటికప్పుడు పేషెంట్లకు ఇవ్వడం ముఖ్యమా..? చంద్రబాబూ.. నువ్వు దిగిపోయేటప్పుడు ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పరిస్థితి ఏంటి? కనీసం ఒక్క వైరాలజీ ల్యాబ్ అయినా పెట్టావా? ఆక్సిజన్ కోసం కేంద్రాన్ని ఒక్కసారైనా ప్రశ్నించావా?” అంటూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు నాని.

ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దు..
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయొద్దని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్‌ జవహర్ రెడ్డి అన్నారు. ఎన్‌440కే వైరస్‌ పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టతనిచ్చిందని, రాష్ట్రంలో ఈ తరహా వైరస్‌ ఉన్నట్టు ఎలాంటి నిర్థారణ జరగలేదని.. అందుకు సంబంధించిన పరిశోధన డేటా కూడా ఏమీలేదని ఆయన వెల్లడించారు.

2020 జూన్‌, జులై నెలల్లో ఏపీ, తెలంగాణ, కర్నాటక నుంచి సీసీఎంబీకి వెళ్లిన నమూనాల్లో ఎన్ 440కె రకం వైరస్ ని గుర్తించారని, దాని ప్రభావం గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దాని ప్రభావం కనిపించిందని, మార్చి నెలనుంచి అది పూర్తిగా కనుమరుగైందని చెప్పారు. మీడియాలో శాస్త్రీయమైన అంశాలపై వార్తలు ప్రసారం చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని జవహర్‌ రెడ్డి సూచించారు.

కేంద్ర బయోటెక్నాలజీ శాఖ క్లారిటీ..
ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ లేదని కేంద్ర బయో టెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణు స్వరూప్‌ స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం బి167 మినహా కొత్త రకం వైరస్‌ ఎక్కడా లేదన్నారు. ఈ మధ్యకాలంలో బి 618 రకం కనుగొన్నప్పటికీ అది త్వరగా కనుమరుగైందని రేణు స్వరూప్‌ పేర్కొన్నారు. ఎన్‌ 440కే వైరస్‌ ప్రభావం దేశంలో ఎక్కడా కనిపించలేదని స్పష్టం చేశారు.

First Published:  6 May 2021 4:43 PM IST
Next Story