Telugu Global
International

ఆంక్షల వలయంలో భారత్..

కరోనా సెకండ్ వేవ్ భారత్ ని వణికిస్తున్న వేళ.. అంతర్జాతీయ సమాజం మన దేశాన్ని ఒంటరిని చేస్తోంది. ఓవైపు కరోనా సాయం అందిస్తున్నట్టు ప్రకటనలు చేస్తూనే, మరోవైపు భారత్ నుంచి రాకపోకల్ని పూర్తిగా నిలిపివేస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఆయా దేశ పౌరులకు సైతం నో ఎంట్రీ బోర్డులు పెట్టేస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం విధించిన ట్రావెల్‌ బ్యాన్‌ ఈరోజు నుంచి అమలులోకి వచ్చింది. మే 4వ తేదీ నుంచి భారత్‌ నుంచి అమెరికాకు రావడాన్ని నిషేధిస్తున్నట్టు గతంలోనే అమెరికా […]

ఆంక్షల వలయంలో భారత్..
X

కరోనా సెకండ్ వేవ్ భారత్ ని వణికిస్తున్న వేళ.. అంతర్జాతీయ సమాజం మన దేశాన్ని ఒంటరిని చేస్తోంది. ఓవైపు కరోనా సాయం అందిస్తున్నట్టు ప్రకటనలు చేస్తూనే, మరోవైపు భారత్ నుంచి రాకపోకల్ని పూర్తిగా నిలిపివేస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఆయా దేశ పౌరులకు సైతం నో ఎంట్రీ బోర్డులు పెట్టేస్తున్నాయి.

అమెరికా ప్రభుత్వం విధించిన ట్రావెల్‌ బ్యాన్‌ ఈరోజు నుంచి అమలులోకి వచ్చింది. మే 4వ తేదీ నుంచి భారత్‌ నుంచి అమెరికాకు రావడాన్ని నిషేధిస్తున్నట్టు గతంలోనే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం వాయిదా వేస్తారని అనుకున్నా కూడా చివరకు అమలులో పెట్టేశారు. కొన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు, జర్నలిస్టులు, కొందరు వ్యక్తులకు మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. ఈ మేరకు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌ మెంట్‌ ప్రకటన జారీ చేసింది. వ్యక్తిగత హోదాలో మినహాయింపు పొందిన వారిలో గ్రీన్‌ కార్డు హోల్డర్లు, భర్త అమెరికాలో ఉండి.. ఇంకా పౌరసత్వం పొందని భార్యలు, వారి 21 ఏళ్లలోపు సంతానానికి మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ ట్రావెల్‌ బ్యాన్‌ ఎన్నాళ్లు అమలులో ఉంటుందనే విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదు.

అటు భారత్ నుంచి తమ దేశానికి వచ్చే పౌరుల్ని ఆస్ట్రేలియా రావొద్దని చెబుతోంది. 14రోజులపాటు ఇండియాలో ఉండి తిరిగి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిందించి. జైలుశిక్ష, భారీ జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. భారత్‌ లో నెలకొన్న సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్న ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, తమ దేశంలో మూడో దశ విజృంభించకుండా నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్న 20వేలమందిని ఆస్ట్రేలియాకు తీసుకొచ్చామని, ఇకపై ఎంట్రీ లేదని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా కూడా తమ దేశ పౌరుల భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు ప్రధాని స్కాట్. గతేడాది నుంచి బయో సెక్యూరిటీ యాక్ట్‌ అమలులో ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్కరినీ జైలుకు పంపించలేదని ఆయన గుర్తుచేశారు.

అటు నేపాల్ ప్రభుత్వం కూడా భారత సరిహద్దుల్ని మూసివేసింది. భారత్‌ తో ఉన్న 35 బోర్డర్‌ పాయింట్లలో 22 మార్గాలను నేపాల్ ప్రభుత్వం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 13 మార్గాలు మాత్రమే ప్రజల రాకపోకలకు వీలుగా తెరచి ఉంచింది. ఇరాన్, కువైట్ కూడా భారత్ నుంచి జరిగే రాకపోకలపై ఆంక్షలు విధించాయి. భారత్, పాక్ నుంచి రాకపోకలను ఇరాన్ నిషేధించగా, కువైట్ సైతం భారత్ నుంచి ప్రయాణికుల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ లో కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తూ.. ప్రపంచంలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్న సందర్భంలో.. ఇతర దేశాలన్నీ భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి.

First Published:  4 May 2021 11:22 AM IST
Next Story