Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ సరసన కేజీఎఫ్ బ్యూటీ

ప్రభాస్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘సలార్’ లో మరో హీరోయిన్ ని ఫైనల్ చేశారు. సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ని తీసుకున్నారు. ఇటివలే ఆమెకి మేకర్స్ నుండి అడ్వాన్స్ వెళ్లిందని టాక్. ప్రస్తుతం కరోన సెకండ్ వేవ్ కారణంగా సలార్ షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే మరో షెడ్యుల్ […]

ప్రభాస్ సరసన కేజీఎఫ్ బ్యూటీ
X

ప్రభాస్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘సలార్’ లో మరో హీరోయిన్ ని ఫైనల్ చేశారు. సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ని తీసుకున్నారు. ఇటివలే ఆమెకి మేకర్స్ నుండి అడ్వాన్స్ వెళ్లిందని టాక్.

ప్రస్తుతం కరోన సెకండ్ వేవ్ కారణంగా సలార్ షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే మరో షెడ్యుల్ మొదలు కానుంది. ఆ షెడ్యుల్ లో శ్రీనిధి శెట్టి జాయిన్ అవుతుంది. నిజానికి ఈ పాత్ర కోసం కొంతమంది పేర్లు అనుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కానీ సెంటిమెంట్ కొద్దీ శ్రీనిథి శెట్టిని తీసుకున్నాడు. తెలుగులో ఆమెకిదే తొలి స్ట్రయిట్ మూవీ.

సలార్ కి సంబంధించి బ్రేక్ లేకుండా శరవేగంగా షెడ్యుల్ జరిపారు యూనిట్. కరీంనగర్ లో గోదావరిఖని ప్రాంతంలో ప్రభాస్ పై కొన్ని సీన్స్ తీశారు. అలాగే హైదరాబాద్ లో కూడా కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. జూన్ లేదా జులై లో మరో భారీ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను హంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

First Published:  4 May 2021 2:02 PM IST
Next Story