Telugu Global
NEWS

ఏపీలో కర్ఫ్యూ మార్గదర్శకాలివే..

ఏపీలో బుధవారం నుంచి అమలు కాబోతున్న కర్ఫ్యూకి సంబంధించి మార్గదర్శకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈమేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం ఉదయం 6 గంటలనుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకేరకమైన ఆంక్షలు అమలులోకి వస్తాయి. మధ్యాహ్యం 12 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల షాపులు అందుబాటులో ఉంటాయి. 12 గంటల తర్వాత పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలులోకి వస్తుంది. ప్రజా రవాణాతోపాటు ప్రైవేటు వాహనాలు కూడా.. బుధవారం […]

ఏపీలో కర్ఫ్యూ మార్గదర్శకాలివే..
X

ఏపీలో బుధవారం నుంచి అమలు కాబోతున్న కర్ఫ్యూకి సంబంధించి మార్గదర్శకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈమేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం ఉదయం 6 గంటలనుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకేరకమైన ఆంక్షలు అమలులోకి వస్తాయి. మధ్యాహ్యం 12 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల షాపులు అందుబాటులో ఉంటాయి. 12 గంటల తర్వాత పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలులోకి వస్తుంది.

ప్రజా రవాణాతోపాటు ప్రైవేటు వాహనాలు కూడా..
బుధవారం నుంచి అమలులోకి రాబోతున్న లాక్ డౌన్ లో 12 గంటల తర్వాత ప్రజా రవాణా మాత్రమే ఆపివేస్తారని తొలుత భావించారు. అయితే ప్రైవేటు వాహనాలపై కూడా ఆంక్షలు విధిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రైవేటు వాహనాలు కూడా రోడ్డెక్కడానికి వీళ్లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆర్టీసీ బస్సులు కూడా 12గంటల తర్వాత అందుబాటులో ఉండవు. దీనికి తగ్గట్టు ముందుగానే సర్వీసులను కుదిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల సర్వీసులు, దూరప్రాంత బస్సులపై పూర్తి స్థాయిలో నిషేధం విధించారు. ఇక రైళ్లలో రాకపోకలు సాగించేవారికి, గమ్యస్థానాలు చేరేందుకు ప్రత్యేక వెసులుబాటు మాత్రం ఉంది.

ఏపీ కేబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు..
– బీసీల రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగింపు.
– మే 13న రాష్ట్రంలోని సుమారు 54 లక్షలమంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ.
– మే 25న 38 లక్షలమంది లబ్ధిదారుల ఖాతాల్లో వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా నగదు జమ.
– మే 18న వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా నగదు జమ, వేటకు వెళ్లే మత్స్యకారులకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం.
– కడప స్టీల్‌ ప్లాంట్‌ ను ఎస్సార్‌ స్టీల్స్‌ సంస్థకు అప్పగించడం
– కృష్ణపట్నం పోర్టులో మౌలిక వసతుల కల్పనకు రూ.1448 కోట్లు మంజూరు
– కైలాసగిరి- భోగాపురం మధ్య ఆరు లైన్ల రోడ్డు వేయడం, 5 ఎకరాల్లో స్కైటవర్స్ నిర్మాణం‌, 11 బీచ్‌ ల అభివృద్ధికి ఆమోదం
– పల్నాడు కరవు నివారణకు రూ.2740 కోట్లు రుణం తీసుకొనేందుకు ఆమోదం

– ప్రభుత్వ పాఠశాలల్లో 7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ ద్వారా విద్యా బోధనకు ఆమోదం. ఏడాదికి ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 10వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలో పరీక్ష రాస్తారు. ఇలా రాష్ట్రంలోని 44,639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం అమలు.
– నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.16వేల కోట్లు ఖర్చు
– ప్రైవేటు వర్సిటీల్లో 35శాతం సీట్లు ప్రభుత్వానికి కేటాయించేలా ప్రైవేటు వర్సిటీ చట్టంలో మార్పు.
– ఎయిడెడ్‌ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించాలి, లేదా పూర్తిగా ప్రైవేటుగా నిర్వహించుకోవాలి.

– ఏపీలో మొత్తం 708 గ్రామాల్లో అందుబాటులోకి అమూల్ సేవలు.
– ఏపీలో అర్చకుల గౌరవ వేతనం రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంపు, బి కేటగిరి ఆలయాల్లో గౌరవ వేతనం రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంపు.
– ఇమామ్‌ ల గౌరవ వేతనం రూ.5వేల నుంచి రూ.10వేలకు, మౌజమ్ ల గౌరవ వేతనం రూ.3వేల నుంచి రూ.5వేలకు పెంపు.
– పోలవరం ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీ నుంచి నీళ్లు తోడేందుకు లిఫ్ట్ నిర్మాణం. హంద్రనీవా ఫేజ్‌-1, ఫేజ్‌-2 పనులకు నిధులు మంజూరు.

కోవిడ్ నివారణకు సంబంధించిన నిర్ణయాలు..
– 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాతే 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయం.
– ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. తమిళనాడు, కర్నాటక, ఒడిశా నుంచి ఆక్సిజన్‌ రప్పించేందుకు చర్యలు.

First Published:  4 May 2021 12:53 PM IST
Next Story