Telugu Global
NEWS

సింహాలకు కరోనా.. అసలు విషయం ఏంటి..?

హైదరాబాద్ జూ పార్క్ లో 8 సింహాలకు కరోనా సోకిందనే వార్త సంచలనం రేకెత్తించిన నేపథ్యంలో సీసీఎంబీ నిపుణులు ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. జూ పార్క్ లోని సింహాలకు కరోనా లక్షణాలు కనిపించినా, వాటికి కోవిడ్ నిర్థారణ కాలేదని, సార్స్ కొవ్-2 గా ఆ వైరస్ ని పిలుస్తారని తెలిపారు. దీనివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని, జంతువుల్లో సహజంగా ఇలాంటి వైరస్ లక్షణాలు కనిపిస్తాయని స్పష్టం చేశారు. కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ […]

సింహాలకు కరోనా.. అసలు విషయం ఏంటి..?
X

హైదరాబాద్ జూ పార్క్ లో 8 సింహాలకు కరోనా సోకిందనే వార్త సంచలనం రేకెత్తించిన నేపథ్యంలో సీసీఎంబీ నిపుణులు ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. జూ పార్క్ లోని సింహాలకు కరోనా లక్షణాలు కనిపించినా, వాటికి కోవిడ్ నిర్థారణ కాలేదని, సార్స్ కొవ్-2 గా ఆ వైరస్ ని పిలుస్తారని తెలిపారు. దీనివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని, జంతువుల్లో సహజంగా ఇలాంటి వైరస్ లక్షణాలు కనిపిస్తాయని స్పష్టం చేశారు. కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయంపై స్పందించింది. ఈ వైర‌స్ వ‌ల్ల మాన‌వుల‌కు ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని, ఇటీవ‌ల జూను సంద‌ర్శించిన వారెవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది.

అసలేం జరిగింది..?
హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్ లో ఈనెల 24న సింహాలు కరోనా తరహా లక్షణాలతో ఇబ్బంది పడటాన్ని నిర్వాహకులు గమనించారు. మొత్తం 8 సింహాలకు ఇలాంటి లక్షణాలు ఉండటంతో.. వాటికి మత్తు మందు ఇచ్చి ముక్కు, గొంతు నుంచి న‌మూనాలు సేక‌రించి సీసీఎంబీకి పంపారు. ఆ న‌మూనాల‌ను ప‌రీక్షించిన సీసీఎంబీ అధికారులు, దాన్ని సార్స్ కొవ్-2 తరహా వైరస్ అని నిర్థారించారు. అయితే జూలో సింహాలకు కరోనా అనే వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో.. సీసీఎంబీ తరపున ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన విడుదలైంది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. జంతువుల ద్వారా ఇది మనుషులకు వ్యాపించే వైరస్ కాదని వారు తేల్చి చెప్పారు.

సింహాలకు కరోనా లక్షణాలు కనిపించిన రోజునుంచే మందు జాగ్రత్తగా జూ అధికారులు, సిబ్బంది చికిత్స ప్రారంభించారు. దీంతో 8 సింహాలు ఇప్పటికే బాగా కోలుకున్నాయని, సాధారణ స్థితికి చేరుకున్నాయని అధికారులు స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం అవి మామూలుగానే ప్రవర్తిస్తున్నాయని, ఆహారం బాగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.

అయితే ఈ పరిణామాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు జూ పార్కులను ఇప్పటికే అధికారులు మూసివేశారు. ఏపీలో కర్ఫ్యూ నిబంధనల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలలు మూసివేశారు. 29 ఎకో టూరిజం సెంటర్లతో పాటు 23 నగర వనాలు మూసేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి 7 టెంపుల్‌ ఎకో పార్కులకు కూడా మూత పడింది.

First Published:  4 May 2021 1:43 PM IST
Next Story