Telugu Global
Cinema & Entertainment

మహేష్ నుంచి 2 సినిమాలొస్తాయా?

మీడియాకు ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినా మహేష్ కు కామన్ గా ఓ ప్రశ్న ఎదురౌతుంది. దానికి మహేష్ కూడా అంతే కామన్ గా జవాబు ఇస్తుంటాడు. ఇంతకీ ఆ కామన్ క్వశ్చన్ ఏంటంటే.. ఎప్పుడు ఏడాదికి 2 సినిమాలు చేస్తారని. దానికి మహేష్ కామన్ సమాధానం ఏంటంటే.. నెక్ట్స్ ఇయర్ రెండు సినిమాలు చేస్తానంటాడు. కానీ మహేష్ ఎప్పుడూ ఏడాదికి 2 సినిమాలు చేయలేదు. ఈసారి మాత్రం మహేష్ నుంచి గ్యారెంటీగా 2 సినిమాలు వచ్చేలా ఉంది. […]

మహేష్ నుంచి 2 సినిమాలొస్తాయా?
X

మీడియాకు ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినా మహేష్ కు కామన్ గా ఓ ప్రశ్న ఎదురౌతుంది. దానికి మహేష్
కూడా అంతే కామన్ గా జవాబు ఇస్తుంటాడు. ఇంతకీ ఆ కామన్ క్వశ్చన్ ఏంటంటే.. ఎప్పుడు ఏడాదికి 2
సినిమాలు చేస్తారని. దానికి మహేష్ కామన్ సమాధానం ఏంటంటే.. నెక్ట్స్ ఇయర్ రెండు సినిమాలు
చేస్తానంటాడు.

కానీ మహేష్ ఎప్పుడూ ఏడాదికి 2 సినిమాలు చేయలేదు. ఈసారి మాత్రం మహేష్ నుంచి గ్యారెంటీగా 2
సినిమాలు వచ్చేలా ఉంది. దీనికి కారణం మహేష్ ప్లానింగ్ కాదు, కరోనా ఎఫెక్ట్. అవును.. కరోనా వల్ల
సినిమాలు వాయిదా పడుతుండడంతో.. వచ్చే ఏడాది మహేష్ నుంచి 2 సినిమాలు రాబోతున్నాయి.

ఆల్రెడీ పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా వచ్చే
ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. ఇక త్రివిక్రమ్ తో తాజాగా మరో సినిమా ప్రకటించాడు మహేష్. ఈ
మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. సో.. మహేష్ నుంచి వచ్చే
ఏడాది 2 సినిమాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  3 May 2021 1:54 PM IST
Next Story