ఏపీలో పాక్షిక కర్ఫ్యూ..
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో కఠిన ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఎల్లుండి బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను నేడు విడుదల చేసింది. ప్రస్తుతం ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. దీంతోపాటు.. వివిధ ప్రాంతాల్లో జిల్లా అధికారులు పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో […]
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో కఠిన ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఎల్లుండి బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను నేడు విడుదల చేసింది. ప్రస్తుతం ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. దీంతోపాటు.. వివిధ ప్రాంతాల్లో జిల్లా అధికారులు పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో నిత్యావసరాల కొనుగోలుకోసం ప్రజల్ని అనుమతిస్తున్నారు. మిగతా సమయం అంతా షాపులు మూసి ఉంచాలనే నిబంధనలు అమలులో ఉన్నాయి.
ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన నిబంధనలు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. పక్క రాష్ట్రం ఒడిశా సహా.. పలు రాష్ట్రాలు కఠిన లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఏపీలో కూడా క్రమ క్రమంగా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు.
పాక్షిక కర్ఫ్యూ అమలులో భాగంగా..
– బుధవారం నుంచి రెండు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ తరహా ఆంక్షలు
– ఉదయం 6గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు
– మధ్యాహ్నం 12 గంటల నుండి పూర్తి స్థాయి కర్ఫ్యూ వాతావరణం
– మధ్యాహ్నం 12 గంటల వరకు 144వ సెక్షన్ అమలు
– ప్రజలు గుమికూడటం, మాస్క్ లేకుండా సంచరించడం నిషేధం
– 2 వారాల తర్వాత నిబంధనలపై సమీక్ష నిర్వహించి మార్పులు చేర్పులు చేసే అవకాశం
కోవిడ్ నియంత్రణపై సీఎం జగన్.. మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ నివారణ చర్యలతో పాటు ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని వివరించారు. బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలులోకి వస్తున్నట్టు ప్రకటించారు.