Telugu Global
Cinema & Entertainment

ఇంకా క్వారంటైన్ లోనే బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి హో ఐసొలేషన్ లో ఉన్న బన్నీ, ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలోకి వచ్చాడు. తన హెల్త్ కండిషన్ గురించి వివరించాడు. ప్రస్తుతం తను కోలుకుంటున్నట్టు ప్రకటించాడు. “హాయ్ ఎవ్రీవన్.. నేను బాగున్నాను. మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయి. బాగానే కోలుకుంటున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఇంకా క్వారంటైన్ లోనే ఉన్నాను. నాపై ఇంత ప్రేమ కురిపిస్తున్నందుకు, నా ఆరోగ్యం కోసం […]

ఇంకా క్వారంటైన్ లోనే బన్నీ
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి హో ఐసొలేషన్ లో ఉన్న
బన్నీ, ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలోకి వచ్చాడు. తన హెల్త్ కండిషన్ గురించి వివరించాడు.
ప్రస్తుతం తను కోలుకుంటున్నట్టు ప్రకటించాడు.

“హాయ్ ఎవ్రీవన్.. నేను బాగున్నాను. మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయి. బాగానే కోలుకుంటున్నాను.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఇంకా క్వారంటైన్ లోనే ఉన్నాను. నాపై ఇంత ప్రేమ
కురిపిస్తున్నందుకు, నా ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్.”

ఇలా తన ప్రజెంట్ హెల్త్ కండిషన్ ను బయటపెట్టాడు బన్నీ. ఏప్రిల్ 28న బన్నీకి వైరస్ ఎఫెక్ట్ అయింది.
ఆ ముందు రోజు వరకు పుష్ప షూటింగ్ లో పాల్గొన్నాడు బన్నీ. షూటింగ్ లొకేషన్ లోనే అతడికి వైరస్ సోకి
ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే, హైదరాబాద్ లోనే 2-3 లొకేషన్లలో భారీ యూనిట్ తో
షూటింగ్ చేశారు.

బన్నీకి కరోనా సోకిందని తెలిసిన వెంటనే పుష్ప యూనిట్ లోని కీలకమైన సభ్యులంతా క్వారంటైన్ లోకి
వెళ్లిపోయారు. దర్శకుడు సుకుమార్ తో పాటు నిర్మాత, సినిమాటోగ్రాఫర్, డైరక్షన్ డిపార్ట్ మెంట్ మొత్తం
హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. మరోవైపు ఈ సినిమాలోకి లేటెస్ట్ గా జాయిన్ అయిన మలయాళ
నటుడు ఫహాద్ ఫాజిల్ కూడా క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు. పుష్ప లో ఇతడు విలన్ గా నటిస్తున్నాడు.

First Published:  3 May 2021 1:50 PM IST
Next Story