నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ విజయం..
నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ 15,487 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 21 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నోముల భగత్ కు 74,726 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డికి 59,239 ఓట్లు లభించాయి. బీజేపీకి కేవలం 6,365 ఓట్లు మాత్రమే రావడం విశేషం. జానారెడ్డి రెండో స్థానంతో […]

నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ 15,487 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 21 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నోముల భగత్ కు 74,726 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డికి 59,239 ఓట్లు లభించాయి. బీజేపీకి కేవలం 6,365 ఓట్లు మాత్రమే రావడం విశేషం. జానారెడ్డి రెండో స్థానంతో సరిపెట్టుకోగా బీజేపీకి డిపాజిట్ గల్లంతు అయింది.
సాగర్ లో నోముల భగత్ గెలుపు లాంఛనమేనని తెలిసినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డి గట్టి పోటీ ఇస్తారని అందరూ అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా భగత్ దే విజయం అని తేల్చాయి. ఈరోజు ఉదయం కౌంటింగ్ మొదలైనప్పటినుంచి భగత్, జానారెడ్డిపై స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. తొలి రౌండ్ లో టీఆర్‌ఎస్ కు 4,228 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 2,753 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చిన భగత్.. కౌంటింగ్ ముగిసే నాటికి 15,487 ఓట్ల క్లియర్ మెజారిటీతో విజయం సాధించారు.
2018 ఎన్నికల్లో నోముల నర్సింహయ్యకు 83,655 ఓట్లు రాగా, జానా రెడ్డి 75,884 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఈ దఫా పోలింగ్ పర్సంటేజీ తగ్గడంతో భగత్ కు వచ్చిన ఓట్లు స్వల్పంగా తగ్గాయి. జానారెడ్డికి గతంలో కంటే 16,645 ఓట్లు తగ్గాయి.