Telugu Global
Cinema & Entertainment

బన్నీ నుంచి మరో పాన్ ఇండియా మూవీ

అల్లు అర్జున్ ”పాన్ ఇండియా” ప్రయత్నాలు ఇప్పటివి కాదు. చాన్నాళ్ల కిందటే ఆయన ఈ దిశగా ఓ అడుగు ముందుకేశారు. లింగుసామి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా ప్రకటించారు. కానీ సెట్స్ పైకి రాకముందే ఆ సినిమా ఆగిపోయింది. ఎట్టకేలకు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ హీరో కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇదే. ఇప్పుడీ ట్రెండ్ కు కొనసాగింపుగా మరో పాన్ ఇండియా సినిమాను ప్రకటించే ఆలోచనలో […]

బన్నీ నుంచి మరో పాన్ ఇండియా మూవీ
X

అల్లు అర్జున్ ”పాన్ ఇండియా” ప్రయత్నాలు ఇప్పటివి కాదు. చాన్నాళ్ల కిందటే ఆయన ఈ దిశగా ఓ అడుగు ముందుకేశారు. లింగుసామి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా ప్రకటించారు. కానీ సెట్స్ పైకి రాకముందే ఆ సినిమా ఆగిపోయింది. ఎట్టకేలకు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ హీరో కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇదే.

ఇప్పుడీ ట్రెండ్ కు కొనసాగింపుగా మరో పాన్ ఇండియా సినిమాను ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు బన్నీ. అన్నీ అనుకున్నట్టు జరిగిదే మురగదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు ఈ హీరో. అయితే మురగదాస్, బన్నీ మధ్య ఇంకా కథాచర్చలు మొదలుకాలేదు.

ఈ ప్రాజెక్టును అల్లు అరవింద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మురుగదాస్ తో టచ్ లో ఉన్నది కూడా ఆయనే. స్టోరీలైన్ కూడా అరవిందే విన్నారు. దాదాపు 7-8 భాషల్లో రిలీజయ్యేలా, అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే స్టోరీలైన్ ను ఇద్దరూ కలిసి ఫిక్స్ చేశారు. ఇక దాన్ని డెవలప్ చేయడమే ఆలస్యం. కొరటాలతో చేయాల్సిన సినిమా మరింత ఆలస్యమైతే, ఈ సినిమానే ముందుకు తీసుకొస్తాడట బన్నీ.

First Published:  2 May 2021 1:26 PM IST
Next Story