Telugu Global
International

భారత్ నుంచి తిరిగొస్తే ఐదేళ్లు జైలు.. ఆస్ట్రేలియా కఠిన ఆంక్షలు..

భారత్ తో విమాన రాకపోకలు పూర్తిగా నిషేధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఇక్కడ ప్రవాసులుగా ఉన్న ఆ దేశ పౌరుల రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించింది. సోమవారం తర్వాత భారత్ నుంచి ఎవరైనా ఆస్ట్రేలియా పౌరులు ఆ దేశానికి వస్తే ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. జైలు శిక్షతోపాటు 66వేల డాలర్ల జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో భారత్ తో రాకపోకలకు ఇతర దేశాలు ఎంతగా భయపడుతున్నాయో చెప్పడానికి […]

భారత్ నుంచి తిరిగొస్తే ఐదేళ్లు జైలు.. ఆస్ట్రేలియా కఠిన ఆంక్షలు..
X

భారత్ తో విమాన రాకపోకలు పూర్తిగా నిషేధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఇక్కడ ప్రవాసులుగా ఉన్న ఆ దేశ పౌరుల రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించింది. సోమవారం తర్వాత భారత్ నుంచి ఎవరైనా ఆస్ట్రేలియా పౌరులు ఆ దేశానికి వస్తే ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. జైలు శిక్షతోపాటు 66వేల డాలర్ల జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో భారత్ తో రాకపోకలకు ఇతర దేశాలు ఎంతగా భయపడుతున్నాయో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ.

ఆస్ట్రేలియా పౌరులు సుమారు 9 వేల మంది వివిధ అవసరాల నిమిత్తం భారత్‌ లో నివ‌సిస్తున్నార‌ని అంచనా. వారిలో కనీసం 600 మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీరందరినీ ఇదివరకే తమ దేశానికి తిరిగి వచ్చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ స్పష్టం చేశారు. సోమవారంతో ఈ గడువు ముగుస్తుందని ఆయన తేల్చి చెప్పారు. సోమవారం తర్వాత ఇక ఆస్ట్రేలియా పౌరులెవరూ ఇండియా నుంచి తమ దేశానికి రావొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చారు. 14రోజులపాటు ఇండియాలో ఉండి.. తిరిగి ఆస్ట్రేలియాలో అడుగు పెడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్పారు. ఐదేళ్లు జైలు శిక్షతోపాటు 37లక్షల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.

బయో సెక్యూరిటీ చట్టం కింద తీసుకొచ్చిన ఈ సరికొత్త నిబంధనల నుంచి ఐపీఎల్‌ ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, శిక్షణ సిబ్బందికి మినహాయింపు ఇచ్చే ఆలోచనలో ఆ దేశ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇలాంటి క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవ‌డం దేశ చ‌రిత్ర‌లోనే ఇదే తొలిసారి అని ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మే 15 తర్వాత ఈ నిర్ణయంపై సమీక్ష నిర్వహిస్తామని ఆస్ట్రేలియా అధికారులంటున్నారు.

First Published:  1 May 2021 6:51 AM
Next Story