Telugu Global
NEWS

తెలంగాణలో కర్ఫ్యూ కంటిన్యూ.. 'ప్రైవేటు' టీకాలపై ఆంక్షలు..

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మరో వారం పాటు పొడిగిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో అమలులో ఉన్న కర్ఫ్యూ నిబంధనలు శనివారం ఉదయంతో ముగిసిపోతున్న నేపథ్యంలో తదుపరి నిర్ణయం ఏంటని రెండు రోజుల క్రితమే హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం మాత్రం సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఈ దశలో ఈరోజు తెలంగాణ హైకోర్టులో కరోనా పరిస్థితులపై విచారణ జరిగింది. రాత్రి కర్ఫ్యూ తర్వాత కరోనా కట్టడి చర్యలు వెల్లడించకపోవడంపై న్యాయస్థానం […]

తెలంగాణలో కర్ఫ్యూ కంటిన్యూ.. ప్రైవేటు టీకాలపై ఆంక్షలు..
X

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మరో వారం పాటు పొడిగిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో అమలులో ఉన్న కర్ఫ్యూ నిబంధనలు శనివారం ఉదయంతో ముగిసిపోతున్న నేపథ్యంలో తదుపరి నిర్ణయం ఏంటని రెండు రోజుల క్రితమే హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం మాత్రం సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఈ దశలో ఈరోజు తెలంగాణ హైకోర్టులో కరోనా పరిస్థితులపై విచారణ జరిగింది. రాత్రి కర్ఫ్యూ తర్వాత కరోనా కట్టడి చర్యలు వెల్లడించకపోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తి వివరాలు తెలపాలని అడ్వొకేట్‌ జనరల్‌ ను ఆదేశించింది. ప్రభుత్వం చెప్పకపోతే తామే ఆదేశాలిస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. దీంతో హైకోర్టు విచారణ ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపింది.

కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ నెల 20నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది తెలంగాణ ప్రభుత్వం. శనివారం ఉదయం 5 గంటలకు ఈ ఆంక్షలు పూర్తవుతాయి. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయం అన్ని వర్గాలనుంచి వ్యక్తం అవుతోంది. అటు హైకోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయంపై గట్టిగా ప్రశ్నించిన వేళ.. రాత్రి కర్ఫ్యూ నిబంధనలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కర్ఫ్యూ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా వేళ, ఎన్నికల నిర్వహణపై కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఇంకా ఏమైనా ఎన్నికలు జరగాల్సి ఉన్నాయా? అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవని అడ్వొకేట్‌ జనరల్‌ సమాధానం ఇచ్చారు. ఎన్నికలు పెట్టి ప్రజలను ఆశ్చర్యపరచొద్దని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.

తెలంగాణలో ప్రైవేటు టీకాలకు నో..
మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాల పంపిణీ నిలిపి వేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ టీకాలు అందుబాటులో ఉండవు. ఇప్పటి వరకు అపాయింట్ మెంట్ లు ఇచ్చి ఉంటే, వాటిని వినియోగించాలని, మిగతా వాటిని ప్రభుత్వానికి అందించాలని ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలందాయి. ఈ మేరకు ప్రైవేటు ఆస్పత్రులకు పంపిణీ నిలిపివేయాలని రాష్ట్రంలోని డిఎంహెచ్ఓలకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా. శ్రీనివాస్‌ ఆదేశాలు జారీ చేశారు.

First Published:  30 April 2021 6:07 AM GMT
Next Story