Telugu Global
NEWS

తెలంగాణలో నో ‘లాక్​డౌన్’

తెలంగాణలో లాక్ డౌన్​ పెట్టే ఆలోచన లేదని పబ్లిక్​ హెల్త్ డైరెక్టర్​ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ ప్రస్తుతం కరోనాతో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో లాక్​డౌన్​ పెడతారని ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్​ ఎర్రబెల్లిలోని ఫామ్​హౌస్​లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే సీఎం కేసీఆర్​కు యాంటిజెన్​ టెస్ట్​లో కరోనా నెగిటివ్​ వచ్చినట్టు సమాచారం. దీంతో ఆర్​టీపీసీఆర్​ పరీక్ష చేశారు. ఈ […]

తెలంగాణలో నో ‘లాక్​డౌన్’
X

తెలంగాణలో లాక్ డౌన్​ పెట్టే ఆలోచన లేదని పబ్లిక్​ హెల్త్ డైరెక్టర్​ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ ప్రస్తుతం కరోనాతో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో లాక్​డౌన్​ పెడతారని ఊహాగానాలు మొదలయ్యాయి.

ప్రస్తుతం సీఎం కేసీఆర్​ ఎర్రబెల్లిలోని ఫామ్​హౌస్​లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే సీఎం కేసీఆర్​కు యాంటిజెన్​ టెస్ట్​లో కరోనా నెగిటివ్​ వచ్చినట్టు సమాచారం. దీంతో ఆర్​టీపీసీఆర్​ పరీక్ష చేశారు. ఈ రిజల్ట్​ కోసం వైద్యులు ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్​ .. కరోనా నుంచి కోలుకున్నాక అధికారులతో సమావేశం కానున్నట్టు సమాచారం.

ఆ తర్వాత లాక్​డౌన్​ పై ఓ నిర్ణయం తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​పై హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ కూడా క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో లాక్​డౌన్​ విధించే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు హెల్త్​ డైరెక్టర్​ శ్రీనివాసరావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

అయితే కరోనా ను కట్టడి చేయడంలో తెలంగాణ సర్కారు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఇప్పటికే హైకోర్టు పలుమార్లు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నైట్​ కర్ఫ్యూ విధించారు. వ్యాక్సినేషన్​ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేయాలని సీఎం కేసీఆర్​ యోచిస్తున్నట్టు సమాచారం. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి వ్యాక్సిన్​ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేయబోతున్నారు.

First Published:  29 April 2021 1:37 AM GMT
Next Story