Telugu Global
NEWS

షర్మిలకు భద్రత కట్​..!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారారు. తాను తెలంగాణ రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతుకుముందే ఆమె పలు జిల్లాల నాయకులు, వైఎస్సార్​ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఖమ్మంలో ఓ భారీ బహిరంగసభ, తెలంగాణ రాష్ట్రంలో వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్​ వేయాలంటూ హైదరాబాద్​లోని ఇందిరా పార్క్​లో దీక్ష చేపట్టారు. అయితే ఖమ్మం బహిరంగసభలో, ఇందిరా పార్కు దీక్షలో ఏకంగా ఆమె సీఎం […]

షర్మిలకు భద్రత కట్​..!
X

దివంగత ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారారు. తాను తెలంగాణ రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతుకుముందే ఆమె పలు జిల్లాల నాయకులు, వైఎస్సార్​ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.

ఖమ్మంలో ఓ భారీ బహిరంగసభ, తెలంగాణ రాష్ట్రంలో వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్​ వేయాలంటూ హైదరాబాద్​లోని ఇందిరా పార్క్​లో దీక్ష చేపట్టారు. అయితే ఖమ్మం బహిరంగసభలో, ఇందిరా పార్కు దీక్షలో ఏకంగా ఆమె సీఎం కేసీఆర్​పైనే విమర్శలు ఎక్కుపెట్టారు. టీఆర్​ఎస్​ నేతలు షర్మిల వ్యాఖ్యలకు పెద్దగా కౌంటర్​ కూడా ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే షర్మిల రాజకీయ పార్టీపెడితే కాంగ్రెస్​ పార్టీకే నష్టమంటూ విశ్లేషణలు సాగాయి. మరోవైపు బీసీ సంఘం నేత ఆర్.​ కృష్ణయ్య, సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్​ కంచె ఐలయ్య సైతం షర్మిల దీక్షకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్​ పార్టీ నుంచి ఒకరిద్దరు నేతలు షర్మిల పెట్టబోయే పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. అయితే షర్మిల రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఆమెకు 2ప్లస్2 గన్‌మెన్లను కూడా ఏర్పాటు చేసింది.

తాజాగా షర్మిలకు భద్రతకు ఉపసంహరించుకుంటున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. కానీ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల షర్మిల నేరుగా సీఎం కేసీఆర్​పైనే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆమెపై టీఆర్​ఎస్​ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. తొలుత షర్మిల రాకతో కాంగ్రెస్​కు నష్టం అని భావించిన టీఆర్​ఎస్​ నేతలు ఆ తర్వాత అలర్ట్​ అయ్యారు. ఆమె నేరుగా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తుండం.. సీఎం కేసీఆర్​పైనే విమర్శలు చేస్తుండటంతో టీఆర్​ఎస్​ నేతలు అలర్ట్​ అయ్యారు. మంత్రులు శ్రీనివాస్​గౌడ్​, పువ్వాడ అజయ్​, ఎర్రబెల్లి ఇప్పటికే షర్మిలకు కౌంటర్లు మొదలు పెట్టారు.

ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, మహబూబ్​నగర్​, గ్రేటర్​ హైదరాబాద్​లో షర్మిల ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రెడ్డి సామాజికవర్గంతో పాటు.. దళితులు కూడా ఆమెకు అండగా నిలబడవచ్చని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్​ పార్టీ భారీగా నష్టపోనున్నది. దీంతో ఆ పార్టీ నేతలు ఎటువంటి దిద్దుబాటు చర్యలకు దిగుతారో వేచి చూడాలి.

First Published:  28 April 2021 9:09 AM IST
Next Story