Telugu Global
NEWS

కరోనా కట్టడిలో ఇంత అలసత్వమా? టీ సర్కార్​పై మరోసారి హైకోర్టు ఫైర్​..

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్​ అయ్యింది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘సోషల్​ డిస్టెన్స్​ పాటించకపోవడంపై 4 కేసులు, ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడటంపై కేవలం 2 కేసులు మాత్రమే నమోదు కావడం ఏమిటి? అసలు రాష్ట్రంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారా? హైకోర్టు ఆదేశాలను కనీసం పట్టించుకుంటున్నారా?’ అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి పలు కీలక సూచనలు జారీచేసింది. రాష్ట్రంలో నైట్​ కర్ఫ్యూను […]

కరోనా కట్టడిలో ఇంత అలసత్వమా? టీ సర్కార్​పై మరోసారి హైకోర్టు ఫైర్​..
X

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్​ అయ్యింది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘సోషల్​ డిస్టెన్స్​ పాటించకపోవడంపై 4 కేసులు, ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడటంపై కేవలం 2 కేసులు మాత్రమే నమోదు కావడం ఏమిటి? అసలు రాష్ట్రంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారా? హైకోర్టు ఆదేశాలను కనీసం పట్టించుకుంటున్నారా?’ అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి పలు కీలక సూచనలు జారీచేసింది.

రాష్ట్రంలో నైట్​ కర్ఫ్యూను పటిష్ఠంగా అమలు చేయాలని.. సభలు, సమావేశాలకు అనుమతులు 50 శాతం తగ్గించాలని సూచించింది. అంబులెన్స్​లు అందుబాటులో లేకపోతే గుర్రాల ద్వారా మృతదేహాలను తరలించాలంటూ సూచించింది. ప్రతిరోజు 108 కు వస్తున్న కాల్స్​ చూస్తుంటునే పరిస్థితి తీవ్రత అర్థమవుతుందని పేర్కొన్నది. వెంటనే అంబులెన్స్​ టోల్​ ఫ్రీ నంబర్లు పెంచాలని కోరింది. ఎటువంటి ప్రణాళిక లేకుండా మున్సిపల్​ ఎన్నికలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

వాయు మార్గాలను ఆక్సిజన్ రవాణాకు సిద్ధంగా ఉంచాలని భారత వాయుసేనను కోరింది. రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్ సరఫరా జరిగేలా చూడాలని కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. 600 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ సరఫరా పెంచాలని ఆదేశించింది. లైఫ్ సేవింగ్ డ్రగ్ సరఫరా కూడా కొరత లేకుండా చేయాల‌ని కోరింది.

పోలీస్​శాఖపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సోషల్ డిస్టెన్స్​ పాటించకపోవడంపై కేవలం నాలుగు కేసులే నమోదు చేయడం ఏమిటి? పోలీసులు ఒక్కసారి లిక్కర్​ షాపుల ముందుకు వెళితే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. నాలుగు కేసులు నమోదు చేయడం చాలా సిల్లీ’ ఎన్నికల నిర్వహణలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా రోడ్​ షోలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. అసలు వీటికి ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారు? అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

First Published:  28 April 2021 12:51 AM GMT
Next Story