Telugu Global
Cinema & Entertainment

రికార్డు బద్దలుకొట్టిన బన్నీ

పుష్ప సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తూ వస్తున్న మేకర్స్ తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. #PushpaRajIntro పేరుతో విడుదలైన ఈ టీజర్ అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. పుష్ప రాజ్ ఎలా ఉంటాడు..? సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి? హీరోయిన్ లుక్ ఎలా ఉండనుంది ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అందిస్తూ పుష్ప రాజ్ ఇంట్రో […]

రికార్డు బద్దలుకొట్టిన బన్నీ
X

పుష్ప సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తూ వస్తున్న మేకర్స్ తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. #PushpaRajIntro పేరుతో విడుదలైన ఈ టీజర్ అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. పుష్ప రాజ్ ఎలా ఉంటాడు..? సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి? హీరోయిన్ లుక్ ఎలా ఉండనుంది ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అందిస్తూ పుష్ప రాజ్ ఇంట్రో వదిలారు. దీంతో సినిమాపై ఉన్న ప్రశ్నల్లో కొన్ని క్లియర్ అయ్యాయి. విడుదలైన నిమిషాలకే రీసెంట్ టైమ్స్ లో ది బెస్ట్ టీజర్ అంటూ సెలబ్రిటీస్ కూడా పోస్టులు పెట్టారు.

ఏప్రిల్ 7న యూట్యూబ్ ద్వారా రిలీజైన ఈ టీజర్ చాలా తక్కువ టైంలో 50 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు నెలకొల్పింది. కేవలం 20 రోజుల్లో అరుదైన రికార్డు అందుకొని పుష్ప టీజర్ తో తన స్టామినా చూపించాడు బన్నీ. ప్రస్తుతం #Fastest50MForPushpaRajIntro ట్యాగ్ తో సోషల్ మీడియాలో పుష్ప టీజర్ ట్రెండ్ అవుతోంది. రిలీజ్ కి ముందే టీజర్ 50 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టిన బన్నీ క్రేజ్ ని పొగుడుతూ అభిమానులు పోస్టులు చేసుకుంటున్నారు.

ఇక బన్నీ -సుక్కు కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తున్న పుష్ప పై అటు బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ లో థియేటర్స్ లోకి రానుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

First Published:  27 April 2021 1:41 PM IST
Next Story