పౌరుడైనా ప్రధాని అయినా ఒక్కటే.. మాస్కులేదని ఫైన్..!
ప్రస్తుతం ప్రపంచం కరోనా అనే మహమ్మారి చేతిలో పడి విలవిలలాడుతున్నది. మిగతా దేశాల పరిస్థితి ఎలా ఉన్నా.. భారత్ మాత్రం చిగురుటాకులా వణికిపోతున్నది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు, లాక్డౌన్ అమలు చేయలేకపోతున్నాయి. దీంతో రోజుకు వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ అందక కొందరు తుదిశ్వాస విడుస్తున్నారు. కొందరు రోగులకు కనీసం ఆస్పత్రుల్లో బెడ్స్ కూడా దొరకడం లేదు. శ్మశానాల్లోనూ శవాలతో జాగరణ చేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో […]
ప్రస్తుతం ప్రపంచం కరోనా అనే మహమ్మారి చేతిలో పడి విలవిలలాడుతున్నది. మిగతా దేశాల పరిస్థితి ఎలా ఉన్నా.. భారత్ మాత్రం చిగురుటాకులా వణికిపోతున్నది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు, లాక్డౌన్ అమలు చేయలేకపోతున్నాయి. దీంతో రోజుకు వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ అందక కొందరు తుదిశ్వాస విడుస్తున్నారు. కొందరు రోగులకు కనీసం ఆస్పత్రుల్లో బెడ్స్ కూడా దొరకడం లేదు. శ్మశానాల్లోనూ శవాలతో జాగరణ చేసే పరిస్థితి వచ్చింది.
ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. థాయిలాండ్లో ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఆ దేశంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆ దేశంలో మాస్కు ధారణ తప్పనిసరి చేశారు. మాస్కు లేకుండా ప్రజలెవరైనా బయటకు వస్తే 20 వేల భట్‌లు అంటే మన కరెన్సీలో రూ. 48 వేల ఫైన్ వేస్తున్నారు.
ఇటీవల ఆ దేశ ప్రధాని ప్రయుత్ చాన్–ఓచా ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం కూడా కరోనా వ్యాక్సినేషన్ కోసమే. అయితే ఈ మీటింగ్లో చాలా మంది ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నారు. వారంతా మాస్కు పెట్టుకున్నారు. కానీ ప్రధాని మాత్రం మాస్కు పెట్టుకోలేదు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు .. ప్రధాని వ్యక్తిగత కార్యదర్శులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రధాని మాస్క్ పెట్టుకోకపోవడంపై నెటిజన్లు ట్రోల్ చేశారు. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది రూల్ ప్రకారం ప్రధానికి ఫైన్ విధించారు.
అయితే తొలి ఉల్లంఘన
కాబట్టి 6 వేల భట్‌లు (రూ.14,250) జరిమానా విధించారు. ఈ విషయంపై బ్యాంకాక్ నగర గవర్నర్ అశ్విన్ క్వాన్‌మువాంగ్ స్పందించారు. ప్రధాని నుంచి దర్యాప్తు అధికారులు జరిమానా వసూలు చేశారని తెలిపారు.