అధికారికంగా ఆచార్య వాయిదా
ఆచార్య సినిమా వాయిదా పడిందనే విషయం ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఓవైపు షూటింగ్ ఆగిపోయింది. మరోవైపు విడుదల తేదీ దగ్గరపడింది. దీంతో సినిమా కచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని అంతా ఊహించారు. ఆ ఊహల్ని నిజం చేస్తూ ఈరోజు ఆచార్య యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆచార్య షూటింగ్ ఆగిపోయిందని ప్రకటించిన యూనిట్.. చెప్పిన తేదీకి సినిమా రావడం లేదని ప్రకటించింది. కొత్త విడుదల తేదీని యూనిట్ ప్రకటించలేదు. సరైన […]
ఆచార్య సినిమా వాయిదా పడిందనే విషయం ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఓవైపు షూటింగ్ ఆగిపోయింది. మరోవైపు విడుదల తేదీ దగ్గరపడింది. దీంతో సినిమా కచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని అంతా ఊహించారు. ఆ ఊహల్ని నిజం చేస్తూ ఈరోజు ఆచార్య యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆచార్య షూటింగ్ ఆగిపోయిందని ప్రకటించిన యూనిట్.. చెప్పిన తేదీకి సినిమా రావడం లేదని ప్రకటించింది. కొత్త విడుదల తేదీని యూనిట్ ప్రకటించలేదు. సరైన సమయం చూసి కొత్త విడుదల తేదీ చెబుతామని మాత్రమే చెప్పింది.
నిజానికి వాయిదా పడిందని చెప్పేకంటే కొత్త విడుదల తేదీ చెప్పాలనుకున్నారు మేకర్స్. చిరంజీవి ఐడియా ఇది. కాకపోతే ఇప్పట్లో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడం లేదు. అందుకే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిన విషయాన్ని ముందుగా ప్రకటించారు.
అయితే ఆచార్య సినిమా ఆగస్ట్ లో విడుదలవుతుందనే విషయం ఇప్పటికే బయటకొచ్చింది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఆగస్ట్ మూడో వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఇంకా 10 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అంతలోనే షూటింగ్ ఆగిపోయింది. ఆ 10 రోజుల షూట్ కూడా పూర్తయి ఉంటే, నేరుగా పోస్ట్ ప్రొడక్షన్ లోకి వెళ్లిపోయేవాళ్లు. ఈ లాక్ డౌన్ టైమ్ లోనే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయేది. కానీ అది సాధ్యం కాలేదు.