Telugu Global
International

భారత్ కు అండగా అమెరికా..

ఇప్పుడు దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా భారత్ కు అండగా ఉంటానని ముందుకొస్తుంది. క‌ష్ట స‌మ‌యాల్లో ఇండియా అమెరికాకు అండ‌గా నిలిచిందని, అందుకే క‌రోనాతో పోరాడుతున్న ఇండియాకు అవ‌స‌ర‌మైన అన్ని రకాల స‌హాయం చేస్తామ‌ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు క‌మ‌ల హ్యారిస్‌ అన్నారు. ఇండియాకు అత్యవ‌స‌ర‌మైన మందులు, ప‌రిక‌రాలు పంపిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. మ‌హ‌మ్మారి తొలినాళ్లలో మా హాస్పిట‌ల్స్ కోవిడ్ పేషెంట్లతో కిక్కిరిసిపోయి ఒత్తిడిలో ఉన్న స‌మ‌యంలో ఇండియా మాకు […]

భారత్ కు అండగా అమెరికా..
X

ఇప్పుడు దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా భారత్ కు అండగా ఉంటానని ముందుకొస్తుంది. క‌ష్ట స‌మ‌యాల్లో ఇండియా అమెరికాకు అండ‌గా నిలిచిందని, అందుకే క‌రోనాతో పోరాడుతున్న ఇండియాకు అవ‌స‌ర‌మైన అన్ని రకాల స‌హాయం చేస్తామ‌ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు క‌మ‌ల హ్యారిస్‌ అన్నారు.

ఇండియాకు అత్యవ‌స‌ర‌మైన మందులు, ప‌రిక‌రాలు పంపిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. మ‌హ‌మ్మారి తొలినాళ్లలో మా హాస్పిట‌ల్స్ కోవిడ్ పేషెంట్లతో కిక్కిరిసిపోయి ఒత్తిడిలో ఉన్న స‌మ‌యంలో ఇండియా మాకు సాయం చేసిందని, ఇప్పుడు మేము కూడా ఇండియాకు అవ‌స‌ర‌మైన సాయం చేస్తాం అని బైడెన్ త‌న ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. అమెరికాతో పాటు ఇంగ్లాండ్, బ్రిటన్, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా ఇలా అనేక దేశాలు.. ‘భారత్‌ అవసరాల మేరకు సాయం అందించడానికి మేం సిద్ధంగా ఉన్నామని, భారతీయులు త్వరలోనే మహమ్మారిని ఓడిస్తారని విశ్వసిస్తున్నాం'అని తెలిపాయి.

First Published:  26 April 2021 8:57 AM IST
Next Story