Telugu Global
Health & Life Style

డిస్టెన్సింగ్ అలవాటుగా మారాలంటే..

సెకండ్ వేవ్ లో వైరస్ కర్వ్ రోజురోజుకీ పైపైకి పాకుతుంది. కర్వ్ ను ఫ్లాట్‌ చేయాలంటే.. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ఒక్కటే దారి. దానికోసం డిస్టెన్సింగ్‌ని అలవాటుగా చేసుకోవాల్సి ఉంది. దానికోసం ఇప్పటినుంచే లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటంటే.. సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే.. డిస్టెన్సింగ్ కూడా లైఫ్‌స్టైల్‌లో భాగమైపోతుంది. ఎప్పటిలాగానే పనులన్నీ చేసుకుంటూనే దూరాన్ని మెయింటెయిన్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. అది ఎలా ప్లాన్ చేసుకోవాలంటే.. ఒక రోజంతా ముందుగా ఒకరోజంతా ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా […]

డిస్టెన్సింగ్ అలవాటుగా మారాలంటే..
X

సెకండ్ వేవ్ లో వైరస్ కర్వ్ రోజురోజుకీ పైపైకి పాకుతుంది. కర్వ్ ను ఫ్లాట్‌ చేయాలంటే.. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ఒక్కటే దారి. దానికోసం డిస్టెన్సింగ్‌ని అలవాటుగా చేసుకోవాల్సి ఉంది. దానికోసం ఇప్పటినుంచే లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటంటే..

సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే.. డిస్టెన్సింగ్ కూడా లైఫ్‌స్టైల్‌లో భాగమైపోతుంది. ఎప్పటిలాగానే పనులన్నీ చేసుకుంటూనే దూరాన్ని మెయింటెయిన్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. అది ఎలా ప్లాన్ చేసుకోవాలంటే..

ఒక రోజంతా
ముందుగా ఒకరోజంతా ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా టార్గెట్ పెట్టుకోవాలి. ఆ రోజులో ఏ పని చేసినా మనిషికి, మనిషికి మధ్య దూరం పాటిస్తూనే చేయాలి. ఆఖరికి ఇంట్లో ఉన్నప్పుడు కూడా దూరం నుంచి మాట్లాడుకోవడం. టీవీ కూడా దూరంగా కూర్చొని చూడడం.. ఇలా ఏది చేసినా దూరాన్ని పాటిస్తూ చేయడం వల్ల డిస్టెన్సింగ్ కొంతవరకూ అలవాటుగా మారుతుంది.

వాకింగ్‌తో..
చాలామందికి రోజులో మొదటి యాక్టివిటీ వాకింగ్. అందుకే ఇక్కడి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. పార్కుల్లో వాకింగ్ చేసేటప్పుడు ఆరడుగుల దూరం పాటిస్తూ అదొక గేమ్‌లా ఫీలవుతూ వాకింగ్ చేయాలి. అలాగే వాకింగ్ చేసేటప్పుడు దూరంగా ఉంటూ వీలైనంత వరకూ మాట్లాడకుండా ఉండేలా చూసుకోవాలి.

పిల్లలకు కూడా
వాకింగ్‌తో పాటు జిమ్ చేసేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు కూడా దూరాన్ని ప్రైమరీ యాక్టివిటీగా మైండ్‌లో ఉంచుకోవాలి. పిల్లలకు కూడా ఆటలన్నీ దూరంగా ఉంటూనే ఆడుకోమని చెప్పాలి. ఇంట్లో ఆడుకునేటప్పుడు, తినేటప్పుడు దూరాన్ని మెయింటెయిన్ చేయడాన్ని పిల్లలకు అలవాటు చేయాలి.

ప్రయాణాల్లో
ఇకపోతే ప్రయాణాల్లో ఎలాగూ డిస్టెన్సింగ్ పాటించే విధంగా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌కు కట్టుబడి ఉండాలి. బస్సు, రైలు, విమానాలు, కార్లలో పక్కపక్కన కూర్చోకుండా దూరాన్ని పాటించాలి. అలాగే జనం బాగా గుమి గూడే మరో ప్లేస్ ట్రాఫిక్ జామ్. ఇక్కడ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండడం అవసరం. సిగ్నల్‌లో పక్కపక్కనే వాహనాలు నిలపకుండా ముందు బైక్‌కి ఆరడుగుల దూరంలో బైక్ ఆపాలి. అలాగే వెనుక వారిని కూడా కాస్త దూరాన్ని పాటించమని రిక్వెస్ట్ చేయాలి . ఇలా ట్రాఫిక్‌లో ఎవరికి వాళ్లు దూరంగా బైక్స్‌ను ఆపడం వల్ల మిగతా వారిని ఇన్‌స్పైర్ చేసిన వాళ్లమవుతాం.

గుర్తుంచుకోవాలి
కొన్ని నెలలకు రోజులన్నీ మామూలుగా మారిపోవచ్చు. అయినప్పటికీ వైరస్ మన మధ్య ఉన్నంతకాలం.. అదొకటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది ఎప్పుడు ఏ మూల నుంచి వస్తుందో అన్న అప్రమత్తంతో.. దూరాన్ని, శుభ్రతను ఎప్పటికప్పుడు పాటిస్తూ వాటిని లైఫ్‌స్టైల్‌లో భాగంగా చేసుకోవాలి.

First Published:  26 April 2021 1:31 AM GMT
Next Story