నెలసరి టైంలో వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇచ్చారు. మరోవైపు 45 ఏళ్లు నిండిన వాళ్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వాళ్లకు 45 ఏళ్ల లోపు వాళ్లకు వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ రూమర్ వైరల్ అవుతోంది. అదేమిటంటే నెలసరికి ఐదురోజుల […]
దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇచ్చారు. మరోవైపు 45 ఏళ్లు నిండిన వాళ్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వాళ్లకు 45 ఏళ్ల లోపు వాళ్లకు వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ రూమర్ వైరల్ అవుతోంది. అదేమిటంటే నెలసరికి ఐదురోజుల ముందు.. ఐదురోజుల తర్వాత వ్యాక్సినేషన్ వేయించుకోవద్దని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అయితే ఈ విషయంపై వైద్య నిపుణులు మాట్లాడుతూ.. ‘వ్యాక్సినేషన్‌కు నెలసరికి ఏ రకమైన సంబంధం లేదు. నెలసరి టైంలోనూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది’ అని వైద్యులు పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కొట్టి పారేసింది. ఇదంతా ఒట్టి పుకారేనని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొన్నది.
మరోవైపు ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని.. ఇదంతా తప్పుడు ప్రచారమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్‌లో పేర్కొంది. ప్రభుత్వమే ఇటువంటి నిబంధన తీసుకొచ్చిందని కొందరు దుష్ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఈ విషయంపై నేరుగా కేంద్ర ప్రభుత్వం, పలువురు డాక్టర్లు స్పందించారు.
కాగా,18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 తర్వాత వ్యాక్సినేషన్ చేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 28 నుంచి కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవనున్నాయి. మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 29 లక్షల టీకా డోసుల పంపిణీ జరిగింది.