Telugu Global
Cinema & Entertainment

క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు

రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోలతో పాటు మరో హీరో మహేష్ బాబు కూడా హోం క్వారంటైన్ లో ఉంటున్న విషయం తెలిసిందే. వీళ్లలో చరణ్, ప్రభాస్ తమ హెల్త్ అప్ డేట్స్ ఇచ్చారు. మహేష్ మాత్రం అన్నింటికీ దూరంగా ఉండిపోయాడు. దీంతో కొంతమంది మహేష్ ఆరోగ్య స్థితిపై ఆందోళన వ్యక్తంచేయగా, ఫ్యాన్స్ తెగ కంగారు పడ్డారు. ఈరోజు రిలీజైన ఫొటోతో మహేష్ పై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. మహేష్ ఐసొలేషన్ లో లేడు. ఇంట్లోనే క్వారంటైన్ […]

క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు
X

రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోలతో పాటు మరో హీరో మహేష్ బాబు కూడా హోం క్వారంటైన్ లో ఉంటున్న విషయం తెలిసిందే. వీళ్లలో చరణ్, ప్రభాస్ తమ హెల్త్ అప్ డేట్స్ ఇచ్చారు. మహేష్ మాత్రం అన్నింటికీ దూరంగా ఉండిపోయాడు. దీంతో కొంతమంది మహేష్ ఆరోగ్య స్థితిపై ఆందోళన వ్యక్తంచేయగా, ఫ్యాన్స్ తెగ కంగారు పడ్డారు.

ఈరోజు రిలీజైన ఫొటోతో మహేష్ పై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. మహేష్ ఐసొలేషన్ లో లేడు. ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటూ సరదాగా పిల్లలతో గడుపుతున్నాడు. దీనికి సంబంధించి మహేష్ భార్య నమ్రత ఓ చూడచక్కనైన ఫొటోను షేర్ చేశారు.

ఫొటోలో చిన్న షార్ట్, టీషర్ట్ వేసుకున్న మహేష్ బాబు.. కూతురు సితారతో సరదాగా గడుపుతున్నాడు. ఈ ఫొటోతో మహేష్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడనే విషయం బయట సమాజానికి తెలిసొచ్చింది.

ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. ఆ సినిమా సెకెండ్ షెడ్యూల్ టైమ్ లోనే సెట్స్ లో కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మహేష్ హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రిలీజైన స్టిల్ ఇది మాత్రమే.

First Published:  25 April 2021 3:49 PM IST
Next Story