ఏపీలో మరో ఉపపోరు..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మళ్లీ మొదలైంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, వెంటనే తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. తాజాగా మరో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగబోతున్నది. తెలంగాణలోనూ ఇటీవలే సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. తెలంగాణలో గతంలోనే మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అయితే కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కోర్టు […]
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మళ్లీ మొదలైంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, వెంటనే తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. తాజాగా మరో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగబోతున్నది.
తెలంగాణలోనూ ఇటీవలే సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. తెలంగాణలో గతంలోనే మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అయితే కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కోర్టు కేసులు, ఇతర కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. వాటికి ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదలైంది.
ఇదిలా ఉంటే ఏపీలోని కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య కొన్ని నెలల కిందట అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్నది. నిజానికి బద్వేల్ నియోజకవర్గం రాజశేఖర్రెడ్డి కుటుంబానికి, వైఎస్సార్ కాంగ్రెస్కు కంచుకోట. 2004 నుంచి ఆ నియోజవర్గంలో కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు.
అయితే గతంలో అంటే 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఆ తర్వాత ఇక్కడ ఆ పార్టీ ఖాతా తెరవలేదు. ఉప ఎన్నికలో అక్కడ టీడీపీ పోటీచేయబోతున్నది.
మరోవైపు బీజేపీ కూడా తన అభ్యర్థిని రంగంలోకి దించబోతున్నది. కడప జిల్లాకు చెందిన కీలక నేత ఆదినారాయణరెడ్డి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. దీంతో ఆయన తన అనుచరుడిని ఈ స్థానంలో పోటీ పెట్టాలని చూస్తున్నారు. వెరసి ఇక్కడ పోటీ రసవత్తరంగా మారబోతున్నది.
బద్వేల్ నియోజవర్గంలో పోటీచేయబోతున్నామని ఇప్పటికే టీడీపీ, బీజేపీ ప్రకటించాయి. దీంతో ఈ ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. బద్వేల్ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. ఇక్కడ ఆ పార్టీ ప్రతి ఎన్నికలోనూ 30 వేల పై చిలుకు మెజార్టీ తోనే గెలుస్తున్నది.
ఉప ఎన్నికలో టీడీపీతో పాటు బీజేపీ కూడా బరిలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే బీజేపీ, టీడీపీ పోటీచేస్తున్నాయి కాబట్టి తమ విజయం పక్కా అని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సానుభూతి అంశం పనిచేస్తుంది కాబట్టి గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని వైసీపీ నేతలు అంటున్నారు.
సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో ఈ నియోజకవర్గంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ కూడా ఓటు బ్యాంకును నిలబెట్టుకొనేందుకు ఇక్కడ పోటీచేయక తప్పని పరిస్థితి. ఇక ఆదినారాయణరెడ్డి సత్తా ఏమిటో? ఈ ఎన్నికలో తేలిపోనున్నది. మొత్తానికి ఏపీలో మరో రసవత్తర పోరు సాగనున్నది.