Telugu Global
Cinema & Entertainment

నిజంగా ఇది ఓటీటీ సినిమానే

కొన్ని రోజుల కిందటి సంగతి. నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కింద రైట్స్ చేశారు. అంతా సెట్ అనుకున్న టైమ్ లో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. ఉప్పెన, జాతిరత్నాలు లాంటి సినిమా క్లిక్ అయ్యాయి. దీంతో నాగార్జునకు కూడా కన్నుకుట్టింది. నిర్మాతకు చెప్పి వైల్డ్ డాగ్ సినిమా రైట్స్ ను వెనక్కి తీసుకొచ్చాడు. భారీగా పబ్లిసిటీ చేసి మరీ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చాడు. […]

నిజంగా ఇది ఓటీటీ సినిమానే
X

కొన్ని రోజుల కిందటి సంగతి. నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ నుంచి మంచి ఆఫర్
వచ్చింది. డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కింద రైట్స్ చేశారు. అంతా సెట్ అనుకున్న టైమ్ లో థియేటర్లు ఓపెన్
అయ్యాయి. ఉప్పెన, జాతిరత్నాలు లాంటి సినిమా క్లిక్ అయ్యాయి. దీంతో నాగార్జునకు కూడా
కన్నుకుట్టింది.

నిర్మాతకు చెప్పి వైల్డ్ డాగ్ సినిమా రైట్స్ ను వెనక్కి తీసుకొచ్చాడు. భారీగా పబ్లిసిటీ చేసి మరీ సినిమాను
థియేటర్లలోకి తీసుకొచ్చాడు. కానీ వైల్డ్ డాగ్ ఆడలేదు. నాగార్జునకు హిట్ దక్కలేదు. కట్ చేస్తే, తాజా
ఒప్పందం ప్రకారం ఇప్పుడీ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఈసారి మాత్రం సినిమా సూపర్
హిట్టయింది.

నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టినరోజు నుంచి ఇప్పటివరకు ట్రెండింగ్ లోనే
కొనసాగుతోంది. థియేటర్లలో చూడ్డానికి ఆసక్తిచూపని జనాలు.. ఓటీటీలో మాత్రం వైల్డ్ డాగ్ కు బ్రహ్మరథం
పట్టారు. మరోవైపు ఈ సినిమా విషయంలో నాగార్జున తప్పుచేశాడనే విశ్లేషణలు కూడా ఊపందుకున్నాయి.
మొదటిసారి చేసుకున్న ఒప్పందం ప్రకారం నేరుగా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే నాగార్జునకు
ఓ హిట్, నిర్మాతకు లాభాలు రెండూ కలిసొచ్చేవని అభిప్రాయపడుతున్నారు.

First Published:  24 April 2021 2:32 PM IST
Next Story