Telugu Global
Cinema & Entertainment

కరోనాకు ఎదురెళ్లి మరీ షూట్

ఓవైపు లవ్ స్టోరీ, టక్ జగదీష్, నారప్ప లాంటి సినిమాలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఆచార్య, రాధేశ్యామ్ లాంటి సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బన్నీ తగ్గడం లేదు. పుష్ప సినిమా షూటింగ్ ను శరవేగంగా కానిచ్చేస్తున్నారు. నిర్మాతల మండలి నిబంధనల్ని ఉల్లంఘించి మరీ పుష్ప షూటింగ్ ను, భారీ యూనిట్ తో నిర్వహిస్తున్నారు. ఓవైపు సినిమా చెప్పిన టైమ్ కు రిలీజవ్వడం కష్టమనే విషయం తెలిసి కూడా యూనిట్ ఎందుకిలా వ్యవహరిస్తోందో […]

కరోనాకు ఎదురెళ్లి మరీ షూట్
X

ఓవైపు లవ్ స్టోరీ, టక్ జగదీష్, నారప్ప లాంటి సినిమాలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఆచార్య, రాధేశ్యామ్
లాంటి సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బన్నీ తగ్గడం లేదు. పుష్ప
సినిమా షూటింగ్ ను శరవేగంగా కానిచ్చేస్తున్నారు.

నిర్మాతల మండలి నిబంధనల్ని ఉల్లంఘించి మరీ పుష్ప షూటింగ్ ను, భారీ యూనిట్ తో
నిర్వహిస్తున్నారు. ఓవైపు సినిమా చెప్పిన టైమ్ కు రిలీజవ్వడం కష్టమనే విషయం తెలిసి కూడా యూనిట్
ఎందుకిలా వ్యవహరిస్తోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రచారం ఊపందుకుంది. రీసెంట్ గా పుష్ప సెట్స్ పైకి ఫహాద్ ఫాసిల్
వచ్చాడు. ఈ మలయాళ నటుడు పుష్పలో విలన్ గా నటిస్తున్నాడు. ఇతడికి సంబంధించిన సన్నివేశాల్ని
పూర్తిచేయడం కోసమే పుష్ప యూనిట్ కరోనాకు ఎదురెళ్లి మరీ షూట్ చేస్తోందనేది ఆ ప్రచారం సారాంశం.

ఫహాద్ తో ఇప్పుడు షూటింగ్ పూర్తిచేయకపోతే.. భవిష్యత్తులో అతడి కాల్షీట్లు దొరకడం కష్టం అవ్వొచ్చని
యూనిట్ భావిస్తోంది. ఎందుకంటే మలయాళంలో ఫహాద్ చాలా బిజీ ఆర్టిస్టు. ఓటీటీలో కూడా తీరిక
లేకుండా నటిస్తుంటాడు. ఇలాంటి నటుడ్ని మళ్లీ పుష్ప సెట్స్ పైకి తీసుకురావాలంటే చాలా సమయం
పట్టొచ్చు.

అందుకే కరోనా వేళలో కూడా పుష్ప షూటింగ్ కొనసాగిస్తున్నారు. బహుశా ఫహాద్ తో షెడ్యూల్ పూర్తయిన
తర్వాత పుష్ప షూటింగ్ ను వాయిదా వేయొచ్చని భావిస్తున్నారు.

First Published:  24 April 2021 2:30 PM IST
Next Story