ధూళిపాళ్లను అరెస్ట్ చేస్తే.. బాబుకు ఉలుకెందుకు? వైసీసీ ఎమ్మెల్యే కిలారి ఫైర్..!
ఏసీబీ అధికారులు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంగం డైయిరీ పేరిట ఆయన అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసీబీ కీలక ఆధారాలు సేకరించి ధూళిపాళ్లకు నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీచేసింది. వివిధ సెక్షన్ల కింద ఆయన మీద కేసులు పెట్టారు. ఇదిలా ఉంటే ధూళిపాళ్ల అరెస్ట్‌ను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా, ఆ పార్టీ నేతలంతా ఆయన అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ […]
ఏసీబీ అధికారులు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంగం డైయిరీ పేరిట ఆయన అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసీబీ కీలక ఆధారాలు సేకరించి ధూళిపాళ్లకు నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీచేసింది. వివిధ సెక్షన్ల కింద ఆయన మీద కేసులు పెట్టారు.
ఇదిలా ఉంటే ధూళిపాళ్ల అరెస్ట్‌ను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా, ఆ పార్టీ నేతలంతా ఆయన అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో పొన్నూర్ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య స్పందించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ధూళిపాళ్ల ఎంతో అవినీతి పరుడని ఆరోపించారు. అటువంటి అక్రమార్కుడిని చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు? ధూళిపాళ్ల చేసిన అవినీతిలో చంద్రబాబు వాటా ఎంత ఉంది? ప్రశ్నించారు.
సంగం డైయిరీ పేరుతో ధూళిపాళ్ల వందల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. అప్పట్లో చంద్రబాబు సహకారంతోనే ధూళిపాళ్ల అవినీతి సాగిందని విమర్శించారు. ఏపీలోని పాల డెయిరీలను నాశనం చేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందని మండిపడ్డారు.
'కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి రైతులు అంతా కలిసి సంగం డెయిరీ 1977లో స్థాపించారు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఈ డెయిరీకి సహకారం అందించింది. అయితే చంద్రబాబు తన సొంత ఆస్తి లాగా .. ఈ డెయిరీని ధూళిపాళ్లకు రాసిచ్చారు. ఆయన విచ్చలవిడిగా అవినీతి చేశారు. డెయిరీకి చెందిన ఆస్తులను తన సొంత ట్రస్ట్‌కు బదలాయించుకున్నారు.'
ఏసీబీ వద్ద ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయి. అందుకే ఆయనను అరెస్ట్ చేసింది. కానీ చంద్రబాబు మాత్రం ఓ అవినీతి పరుడిగా వంతపాడటం సిగ్గుచేటు. ఈ అవినీతిలో చంద్రబాబు వాటా ఉంది కాబట్టే ఆయన నిందితుడికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు.
‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు తన సొంత సంస్థ హెరిటేజ్ కోసం.. ప్రభుత్వ డెయిరీలను అన్నింటిని దెబ్బతీశారు. చిత్తూరు సహా వివిధ జిల్లాల్లో పాల సహకార సంఘాలను సర్వనాశనం చేశారు. చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్టణం ప్రాంతాల్లో చంద్రబాబు స్వప్రయోజనాల కోసం సహకార సంఘాలను నాశనం చేశారు.
‘సంగం డెయిరీకి చెందిన 10 ఎకరాల భూమిని.. ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌కు బదలాయించుకున్నారు. ఇందులో చంద్రబాబు వాటా ఎంతో తేలాల్సి ఉంది. సహకార సంఘానికి చెందిన భూమిని ప్రభుత్వ అనుమతి లేకుండా తన సొంత ట్రస్ట్ కు బదలాయించడం నేరం కాదా? సంగం డెయిరీ పేరిట కొన్ని తప్పుడు పత్రాలు సృష్టించి దాదాపు రూ. 100 కోట్ల మేర బ్యాంక్ లోన్ తీసుకున్నారు. ఇటువంటి అన్ని అక్రమాలమీద ఏసీబీ సమగ్ర దర్యాప్తు చేసింది. పక్కా ఆధారాలతోనే
ధూళిపాళ్లను అరెస్ట్ చేశారు.
అయితే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ మాత్రం అక్రమార్కులను వెనకేసుకొస్తున్నారు’ అంటూ ఎమ్మెల్యే కిలారి ఫైర్ అయ్యారు.