Telugu Global
Cinema & Entertainment

ఇండస్ట్రీ హిట్ మూవీకి సీక్వెల్!

ఊహించని విధంగా, ఊహించని రూమర్ ఒకటి తెరపైకొచ్చింది. అదేంటంటే.. సుకుమార్-రామ్ చరణ్ మరోసారి కలుస్తున్నారట. ఇక్కడ వరకు ఓకే. ఆ తర్వాత మేటరే మరింత ఆసక్తికరంగా ఉంది. వీళ్లిద్దరూ కలిసి రంగస్థలం సినిమాకు సీక్వెల్ చేస్తారట. వినడానికి ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది ఈ పుకారు. కాకపోతే ఆచరణలో సాధ్యమేనా అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ చాలా కొర్రీలు ఉన్నాయి మరి. ఎంత పెద్ద సినిమాకైనా సీక్వెల్ చేయనని, తండ్రి నటించిన సినిమాల్ని రీమేక్ చేయనని రామ్ […]

ఇండస్ట్రీ హిట్ మూవీకి సీక్వెల్!
X

ఊహించని విధంగా, ఊహించని రూమర్ ఒకటి తెరపైకొచ్చింది. అదేంటంటే.. సుకుమార్-రామ్ చరణ్ మరోసారి కలుస్తున్నారట. ఇక్కడ వరకు ఓకే. ఆ తర్వాత మేటరే మరింత ఆసక్తికరంగా ఉంది. వీళ్లిద్దరూ కలిసి రంగస్థలం సినిమాకు సీక్వెల్ చేస్తారట. వినడానికి ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది ఈ పుకారు. కాకపోతే ఆచరణలో సాధ్యమేనా అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ చాలా కొర్రీలు ఉన్నాయి మరి.

ఎంత పెద్ద సినిమాకైనా సీక్వెల్ చేయనని, తండ్రి నటించిన సినిమాల్ని రీమేక్ చేయనని రామ్ చరణ్ ఇదివరకే ప్రకటించాడు. ఆరు నూరైనా ఈ విషయంలో గట్టి పట్టుమీద ఉన్నాడు. హిట్ సినిమాకు సీక్వెల్ చేసిన తర్వాత ఫ్లాప్ అయినా, తండ్రి నటించిన హిట్ సినిమాను రీమేక్ చేసిన తర్వాత ఫ్లాప్ అయినా అది తనకు ఇబ్బందికరం అనేది చరణ్ భయం. అందుకే సీక్వెల్స్, రీమేక్స్ కు ఎప్పుడూ నో చెబుతుంటాడు.

ఈ నేపథ్యంలో సుకుమార్ వచ్చి రంగస్థలం సీక్వెల్ చేద్దామంటే చరణ్ ఒప్పుకుంటాడా అనేది ఆలోచించాల్సిన విషయం. సరిగ్గా ఇక్కడే మధ్యేమార్గంగా మరో వాదన తెరపైకొచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్టు సుక్కూ-చెర్రీ కలిసి ఓ కొత్త కథతోనే సెట్స్ పైకి వస్తారు. కాకపోతే దానికి రంగస్థలం-2 అనే టైటిల్ పెడతారట.

ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ రూమర్స్ మాత్రమే. ఎంతవరకు నిజమో తేలాలంటే దాదాపు మరో ఏడాది ఆగాల్సిందే.

First Published:  24 April 2021 2:20 PM IST
Next Story