Telugu Global
NEWS

ఏపీలో నేటి నుంచి నైట్​ కర్ఫ్యూ..!

ఆంధ్రప్రదేశ్​లో కరోనా విపరీతంగా వ్యాపిస్తున్నది. రోజుకు 10 వేలకు పై చిలుకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉప క్రమించింది. సీఎం జగన్​ మోహన్ రెడ్డి.. కరోనా కట్టడికి రూ. 1600 కోట్లు కేటాయించారు. మరోవైపు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనున్నది. అత్యవసర సేవలు మినహా.. మిగిలిన అన్ని సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ […]

ఏపీలో నేటి నుంచి నైట్​ కర్ఫ్యూ..!
X

ఆంధ్రప్రదేశ్​లో కరోనా విపరీతంగా వ్యాపిస్తున్నది. రోజుకు 10 వేలకు పై చిలుకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉప క్రమించింది. సీఎం జగన్​ మోహన్ రెడ్డి.. కరోనా కట్టడికి రూ. 1600 కోట్లు కేటాయించారు. మరోవైపు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనున్నది.

అత్యవసర సేవలు మినహా.. మిగిలిన అన్ని సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ కూడా వేగంగా సాగుతున్నది. అయితే మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్​ ఇవ్వబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ వ్యాక్సినేషన్​కు ప్రజలు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జగన్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రజలకు ఉచితంగా వ్యాక్సినేషన్​ అంటే 18 ఏళ్లు నిండిన వారికి 45 ఏళ్ల లోపు వారందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్​ ఇవ్వబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటికే 45 ఏళ్లు నిండిన వారికి కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్​ ఇస్తోంది. అయితే 18 ఏళ్లు నిండిన వాళ్ల నుంచి డబ్బు వసూలు చేయబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఉచితంగా వ్యాక్సినేషన్​ ఇస్తామని కొన్ని రాష్ట్రాల్లో హామీ ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడు వ్యాక్సిన్​కు డబ్బు వసూలు చేయడం ఏమిటని పలువురు ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రజలకు వ్యాక్సినేషన్​ ఉచితంగానే ఇస్తామని ప్రకటించాయి. కేరళ, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాలు ఉచితంగా వ్యాక్సిన్​ ఇస్తామని ప్రకటించాయి. ఏపీ సీఎం జగన్​ మోహన్​రెడ్డి కూడా తమ రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన వారికి ఉచితంగా వ్యాక్సిన్​ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.

ఇందుకోసం పలువురు ఎంపీలు, ఐపీఎస్​ అధికారులు సైతం విరాళాలు ప్రకటించారు. రాష్ట్రంలో 18–45 వయసులో మొత్తం 2,04,70,364 మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో మాత్రం వ్యాక్సినేషన్​పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

First Published:  24 April 2021 1:46 PM IST
Next Story