అందరూ లాభాల్లోకి వచ్చారట
వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి దిల్ రాజు కాంపౌండ్ నుంచి మరో లీక్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు సంబంధించి బయ్యర్లు, ఎగ్జిబిటర్లంతా లాభాలు కళ్లజూశారనేది ఆ లీక్ సారాంశం. వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని, అంతా సేఫ్ అని చెప్పడం కోసమే ఈ లీక్ వదిలారనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఇప్పుడే ఎందుకు ఈ లీక్ వచ్చిందనేది ఆసక్తికర అంశం. అదేంటో చూద్దాం. కరోనా దెబ్బకు థియేటర్లన్నీ […]
వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి దిల్ రాజు కాంపౌండ్ నుంచి మరో లీక్ వచ్చేసింది. పవన్ కల్యాణ్
హీరోగా నటించిన ఈ సినిమాకు సంబంధించి బయ్యర్లు, ఎగ్జిబిటర్లంతా లాభాలు కళ్లజూశారనేది ఆ లీక్
సారాంశం. వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని, అంతా సేఫ్ అని చెప్పడం కోసమే ఈ లీక్ వదిలారనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఇప్పుడే ఎందుకు ఈ లీక్ వచ్చిందనేది ఆసక్తికర అంశం. అదేంటో చూద్దాం.
కరోనా దెబ్బకు థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఉన్న థియేటర్లకు కూడా జనాలు రావడం మానేశారు. వకీల్ సాబ్ సినిమాకైతే వారం రోజుల నుంచే ఆక్యుపెన్సీ పడిపోయింది. ఇక ఈ శని, ఆదివారాలు దాటితే.. ఆ కొద్దిపాటి థియేటర్ల నుంచి కూడా సినిమాను లేపేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అంటే వకీల్ సాబ్ సినిమా ఈ రెండు రోజుల్లో క్లోజింగ్ కు వచ్చేస్తుందన్నమాట. సోమవారం నుంచి సినిమా వసూళ్ల గురించి మాట్లాడితే నిర్మాతతో పాటు, ఫ్యాన్స్ కూడా అడ్డంగా దొరికిపోతారు. అందుకే అంతా లాభాల్లోకి వచ్చారంటూ ఆఘమేఘాల మీద ఈ లీకు వచ్చేసింది.
క్షేత్రస్థాయిలో చూసుకుంటే.. వకీల్ సాబ్ సినిమాను ఉత్తరాంధ్ర, నైజాం, ఈస్ట్ ఏరియాల్లో దిల్ రాజే రిలీజ్ చేశారు. కాబట్టి అక్కడ లాభనష్టాలు అనవసరం. మిగతా ప్రాంతాల విషయానికొస్తే జిల్లాల వారీగా కొంతమంది ఎగ్జిబిటర్లు నష్టపోయినట్టు తెలుస్తోంది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మిలియన్ మార్క్ అందుకోలేకపోయింది. అక్కడ డిస్ట్రిబ్యూటర్ కూడా నష్టాలు చవిచూశాడని టాక్.