Telugu Global
NEWS

టీడీపీ నేత ధూళిపాళ్ల అరెస్ట్.. ! చింతలపూడిలో టెన్షన్​

టీడీపీ సీనియర్​ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన సంగం డెయిరీ చైర్మన్​గా కొనసాగుతున్నారు. సంగం డెయిరీలో ధూళిపాళ్ల అవినీతికి పాల్పడ్డట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసీబీ అధికారులు 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై ప్రస్తుతం నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసినట్టు […]

టీడీపీ నేత ధూళిపాళ్ల అరెస్ట్.. ! చింతలపూడిలో టెన్షన్​
X

టీడీపీ సీనియర్​ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన సంగం డెయిరీ చైర్మన్​గా కొనసాగుతున్నారు. సంగం డెయిరీలో ధూళిపాళ్ల అవినీతికి పాల్పడ్డట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసీబీ అధికారులు 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సీఆర్‌పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై ప్రస్తుతం నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసినట్టు సమాచారం. ఇవాళ ఉదయం ఏసీబీ అధికారులు, పోలీసులు పెద్ద సంఖ్యలో గుంటూరు జిల్లా చింతలపూడికి చేరుకున్నారు. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు.

ధూళిపాళ్ల అరెస్ట్​ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొనే అవకాశం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. రాజధాని భూముల వ్యవహారంలో ఆయనను అరెస్ట్​ చేసి ఉంటారని తొలుత ప్రచారం సాగింది. కానీ ఆయనను సంగం డెయిరీ అవినీతి కేసులో అరెస్ట్​ చేసినట్టు ఏసీబీ అధికారులు ధ్రువీకరించారు.

ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సేకరించాకే ఏసీబీ ధూళిపాళ్లను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన అరెస్ట్​ను తెలుగుదేశం పార్టీ ఖండించింది. టీడీపీకి చెందిన మరో ముఖ్యనేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కు కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయనను త్వరలోనే అరెస్ట్​ చేయబోతున్నట్టు నిన్న వార్తలు వచ్చాయి. దేవినేని ఉమ ఇటీవల సీఎం జగన్​పై తప్పుడు ఆరోపణలు చేశారు. ఓ మార్ఫింగ్​ వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు. వివిధ సందర్భాల్లో జగన్​ మోహన్​రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఏపీ సైబర్​ క్రైమ్​ పోలీసులు దర్యాప్తు చేపట్టి.. సదరు వీడియో మార్ఫింగ్​ చేసిందని తేల్చారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దేవినేనికి నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన మాత్రం విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం దేవినేని ఉమ అజ్ఞాతంలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇంతలోనే ధూళిపాళ్లను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. సంగం డైయిరీ నిర్వహణలో ధూళిపాళ్ల అనేక అవకతవకలకు పాల్పడ్డట్టు సమాచారం.

First Published:  23 April 2021 7:41 AM IST
Next Story