కరోనా నుంచి కోలుకున్న సోనూ సూద్
నటుడు, నేషనల్ రియల్ హీరో సోనూ సూద్ కరోనా నుంచి కోలుకున్నాడు. తనకు పాజిటివ్ వచ్చిందంటూ 5 రోజుల కిందట ప్రకటించి అందర్నీ ఆందోళనకు గురిచేసిన సోనూ, ఈరోజు నెగెటివ్ వచ్చిందంటూ పోస్ట్ పెట్టి అందర్నీ ఆనందంలో ముంచెత్తాడు. మొదటిసారి దేశంలో కరోనా విజృంభించినప్పుపు ఎంతోమందికి ఆపద్బాంధవుడిగా మారాడు సోనూ సూద్. ఆహారం అందించడంతో పాటు వేలాది మందిని తన సొంత ఖర్చుతో వాళ్ల సొంత ఊళ్లకు పంపించాడు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కూడా తన […]
నటుడు, నేషనల్ రియల్ హీరో సోనూ సూద్ కరోనా నుంచి కోలుకున్నాడు. తనకు పాజిటివ్ వచ్చిందంటూ
5 రోజుల కిందట ప్రకటించి అందర్నీ ఆందోళనకు గురిచేసిన సోనూ, ఈరోజు నెగెటివ్ వచ్చిందంటూ పోస్ట్
పెట్టి అందర్నీ ఆనందంలో ముంచెత్తాడు.
మొదటిసారి దేశంలో కరోనా విజృంభించినప్పుపు ఎంతోమందికి ఆపద్బాంధవుడిగా మారాడు సోనూ సూద్.
ఆహారం అందించడంతో పాటు వేలాది మందిని తన సొంత ఖర్చుతో వాళ్ల సొంత ఊళ్లకు పంపించాడు.
కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కూడా తన సేవా కార్యక్రమాల్ని వివిధ రూపాల్లో కొనసాగిస్తూనే ఉన్నాడు.
అలాంటి సోనూ సూద్ కు సెకెండ్ వేవ్ లో కరోనా పాజిటివ్ రావడంతో దేశం మొత్తం ఆందోళన వ్యక్తం
చేసింది. అయితే సోనూ మాత్రం చెక్కుచెదరలేదు. ఒంట్లో కరోనా ఉన్నప్పటికీ సేవ చేయడం ఆపలేదు. ఎంతోమంది కరోనా అభాగ్యుల్ని ఆదుకున్నాడు. ఓ పెద్దావిడ కరోనాతో తీవ్రంగా బాధపడుతుంటే.. ఏకంగా ఆమె కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి, హైదరాబాద్ తీసుకొచ్చి మెరుగైన చికిత్స అందిస్తున్నాడు. తన ఆస్తులు అమ్మి మరీ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సేవ చేస్తున్న సోనూ సూద్ కు దేశం మొత్తం సలామ్ కొడుతోంది.