Telugu Global
National

కారు అమ్మి ‘కరోనా’ సేవ

దేశంలో కరోనా కేసులు ఏ రేంజ్​లో పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఆ నంబర్​ చూస్తుంటేనే గుండెల్లో గుబులు పుడుతోంది. ప్రతి రోజు వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ లెక్కల్లో లేని వాళ్లు ఎంతమందో తెలియదు. చాలా చోట్ల శ్మశానాల్లో సైతం ఖాళీ ఉండటం లేదు. కొన్ని చోట్ల అంత్యక్రియల కోసం క్యూ లైన్​ కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. బయటకెళ్తే కరోనా వస్తుందేమోనన్న భయం.. వెళ్లక పోతే పూటగడవని స్థితి .. […]

కారు అమ్మి ‘కరోనా’ సేవ
X

దేశంలో కరోనా కేసులు ఏ రేంజ్​లో పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఆ నంబర్​ చూస్తుంటేనే గుండెల్లో గుబులు పుడుతోంది. ప్రతి రోజు వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ లెక్కల్లో లేని వాళ్లు ఎంతమందో తెలియదు. చాలా చోట్ల శ్మశానాల్లో సైతం ఖాళీ ఉండటం లేదు. కొన్ని చోట్ల అంత్యక్రియల కోసం క్యూ లైన్​ కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

బయటకెళ్తే కరోనా వస్తుందేమోనన్న భయం.. వెళ్లక పోతే పూటగడవని స్థితి .. పేద ప్రజలు ఎంతో ధీనంగా తమ బతుకును వెళ్లదీస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల ఆక్సిజన్​ కొరత ఏర్పడింది. ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్​ దొరక్క దాదాపు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ కొరత ఏర్పడింది. ఢిల్లీ హైకోర్టు సైతం ఈ విషయంపై జోక్యం చేసుకుందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే కరోనా టైంలోనూ చాలా మంది సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కరోనా పేషెంట్లకు భోజనాలు పెడుతూ.. మందులు పంపిణీ చేస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ముంబైకి చెందిన
షహనావాజ్ హుస్సేన్ ఆక్సిజన్​ లేక బాధపడుతున్న వాళ్లకు సాయం చేయాలని భావించారు. ఇందుకోసం షహన్​వాజ్​ ఏకంగా తన ఖరీదైన కారును అమ్మేశాడు. ‘ తర్వాత డబ్బు సంపాదిస్తే కారు కొనుకోవచ్చు. కానీ ప్రాణాలు తీసుకురాలేం కదా. అందుకే కరోనా పేషెంట్ల కోసం కారును అమ్మేశాను’ అని చెప్పాడు షహనావాజ్​ హుస్సేన్​.

షహనావాజ్ హుస్సేన్​ సోదరి.. ఆరునెలల గర్భవతి. ఆమెకు కరోనా సోకింది. ఆమెకు ఆక్సిజన్​ అవసరం అయింది. కానీ ఆక్సిజన్​ అందుబాటులో లేక చనిపోయింది. దీంతో పేద ప్రజలకు ఉచితంగా ఆక్సిజన్​ అందించాలని షహనావాజ్​ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసమే తన కారును అమ్మేశాడు.

ముంబైలోని మాల్వానీ ప్రాంతంలో యూనిటీ అండ్ డిగ్నిటీ ఫౌండేష‌న్ న‌డుతున్నాడు షహనావాజ్. తనకు రోజు 500 నుంచి 600 కాల్స్​ వస్తున్నాయని.. ప్రిస్క్రిప్షన్​ చూసి వాళ్లకు ఆక్సిజన్​ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు షహనావాజ్​ తెలిపారు. ఎవరైనా ఫోన్​ చేస్తే.. వాళ్ల కులం, మతం చూడకుండా అవసరం ఉంటే వెంటనే ఆక్సిజన్​ సిలిండర్లు అందజేస్తున్నట్టు చెప్పారు.

ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసిన ప్రస్తుత తరుణంలో ఓ యువకుడు పేదల కోసం సాయం చేయడాన్ని అంతా ప్రశంసిస్తున్నారు.

First Published:  23 April 2021 2:33 AM IST
Next Story