Telugu Global
NEWS

కేటీఆర్​ కు కరోనా..!

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ కు కరోనా సోకింది. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్వీట్​ చేశారు. తనకు రెండ్రోజులుగా స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్​ చేయించుకున్నానని.. దీంతో కరోనా పాజిటివ్​ అని తేలిందని చెప్పారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్​ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే క్వారంటైన్​ కు వెళ్లాలని.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, ఇటీవలే సీఎం కేసీఆర్​కు, ఎంపీ సంతోష్​ […]

కేటీఆర్​ కు కరోనా..!
X

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ కు కరోనా సోకింది. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్వీట్​ చేశారు. తనకు రెండ్రోజులుగా స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్​ చేయించుకున్నానని.. దీంతో కరోనా పాజిటివ్​ అని తేలిందని చెప్పారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్​ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే క్వారంటైన్​ కు వెళ్లాలని.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

కాగా, ఇటీవలే సీఎం కేసీఆర్​కు, ఎంపీ సంతోష్​ కుమార్​కు కరోనా సోకిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్​ కు కరోనా సోకడంతో ఆయన ఫామ్​హౌస్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కేసీఆర్​ వ్యక్తిగత డాక్టర్​ ఎంవీ రావు నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే రెండ్రోజుల క్రితం సీఎం కేసీఆర్​కు సోమాజిగూడ యశోదలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సీటీ స్కాన్​, ఇతర రక్త పరీక్షలు నిర్వహించారు.

అయితే కేసీఆర్​ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయన ఉపిరితిత్తులకు ఇన్​ఫెక్షన్​ సోకలేదని వైద్యులు తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే ఆ టైంలో మంత్రి కేటీఆర్​, ఎంపీ సంతోష్​ కుమార్​ కేసీఆర్​ వెంటే ఉన్నారు. దీంతో వాళ్లకు కూడా కరోనా సోకినట్టు సమాచారం. ప్రస్తుతం కేటీఆర్​ ప్రగతిభవన్​లో ఐసోలేషన్​ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఓ వైపు ముఖ్యమంత్రికి, ఆయన కుమారుడు కేటీఆర్​ కు కరోనా సోకడంతో టీఆర్​ఎస్​ అభిమానులు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొన్నది. వీరిద్దరూ త్వరగా కోలుకోవాలని టీఆర్​ఎస్​ కార్యకర్తలు పూజలు చేస్తున్నారు.

First Published:  23 April 2021 7:29 AM IST
Next Story