18 ఏళ్లు నిండాయా? అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి..!
దేశంలో కరోనా కోరలు చాస్తున్న విషయం తెలిసిందే. అసంఖ్యాకంగా నమోదవుతున్న కేసులు చూసి ప్రజలు వణికిపోతున్నారు. ఇక తొలిదశ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. అయితే చాలా మందికి మొదటి డోసు ఇచ్చారు. కొంతమందికి మొదటి డోసు కూడా ఇవ్వలేదు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే 18 ఏళ్లు నిండిన వాళ్లందరికి వ్యాక్సినేషన్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. అది కూడా ఉచితంగానే . […]
దేశంలో కరోనా కోరలు చాస్తున్న విషయం తెలిసిందే. అసంఖ్యాకంగా నమోదవుతున్న కేసులు చూసి ప్రజలు వణికిపోతున్నారు. ఇక తొలిదశ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. అయితే చాలా మందికి మొదటి డోసు ఇచ్చారు. కొంతమందికి మొదటి డోసు కూడా ఇవ్వలేదు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే 18 ఏళ్లు నిండిన వాళ్లందరికి వ్యాక్సినేషన్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. అది కూడా ఉచితంగానే .
అయితే మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. ఈ వ్యాక్సిన్‌కు డబ్బు వసూలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం తామే డబ్బు భరిస్తామని.. ప్రజల దగ్గర వసూలు చేయబోమని ప్రకటించాయి. కేంద్రం గతంలో ఎన్నికల టైంలో కొన్ని రాష్ట్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని హామీ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే మే 1 నుంచి ఇవ్వబోయే వ్యాక్సిన్ కోసం ఓ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ కేంద్రం సూచించింది. అదే కోవిన్ యాప్. ఏప్రిల్ 24 నుంచి ఈ యాప్‌లో వ్యాక్సిన్ కావాల్సిన వాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు సింగిల్ వ్యాక్సిన్ డోస్ ధర 400 రూపాయలు, కేంద్రానికి సింగిల్ డోస్ 150 రూపాయలకు అందజేయనున్నట్టు సీరం సంస్థ తెలిపింది. ప్రైవేట్ ఆస్పత్రులకు ఒక్కో వ్యాక్సిన్ డోస్ 600 రూపాయలకు ఇస్తామని చెప్పింది. ఇతర దేశాల వ్యాక్సిన్‌తో పోల్చి చూస్తే కోవిషీల్డ్ ధర చాలా తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెలలో భారీ ఎత్తున కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తామని సీరం సంస్థ సీఈవో వెల్లడించారు.
అయితే రాష్ట్రాలకు, కేంద్రాలకు వేరు వేరు రేట్లకు వ్యాక్సిన్ ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్ర, రాష్ట్రాలకు వేరు వేరు ధరలు ఎందుకు నిర్ణయించారంటూ ఆయన ప్రశ్నించారు.