Telugu Global
NEWS

జగన్​ మదిలో ఏముంది? మండలి కొత్త చైర్మన్​ ఎవరు?

శాసనమండలికి కొత్త చైర్మన్​ రాబోతున్నారు. ప్రస్తుత మండలి చైర్మన్​ ఎంఏ షరీఫ్​ పదవీ కాలం మే 24 తో ముగియనున్నది. ఏపీలో 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. మండలిలో వైసీపీకి మెజార్టీ లేదు. దీంతో చాలా బిల్లులకు మండలిలో బ్రేక్​ పడేది. ఓ దశలో మూడు రాజధానుల బిల్లు.. శాసనసభలో ఆమోదం పొందినప్పటికీ.. మండలి చైర్మన్​ సూచనతో సెలక్ట్​ కమిటీకి వెళ్లింది. దీంతో సీఎం జగన్​.. మండలిని రద్దు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే […]

జగన్​ మదిలో ఏముంది? మండలి కొత్త చైర్మన్​ ఎవరు?
X

శాసనమండలికి కొత్త చైర్మన్​ రాబోతున్నారు. ప్రస్తుత మండలి చైర్మన్​ ఎంఏ షరీఫ్​ పదవీ కాలం మే 24 తో ముగియనున్నది. ఏపీలో 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. మండలిలో వైసీపీకి మెజార్టీ లేదు. దీంతో చాలా బిల్లులకు మండలిలో బ్రేక్​ పడేది. ఓ దశలో మూడు రాజధానుల బిల్లు.. శాసనసభలో ఆమోదం పొందినప్పటికీ.. మండలి చైర్మన్​ సూచనతో సెలక్ట్​ కమిటీకి వెళ్లింది. దీంతో సీఎం జగన్​.. మండలిని రద్దు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు.

ఇదిలా ఉంటే జూన్​ 18 నాటికి మండలిలో వైసీపీ బలం 30 కి పెరుగనున్నది. దీంతో ఆ పార్టీకి చెందిన వ్యక్తే చైర్మన్​ కాబోతున్నారు. అయితే చైర్మన్​ పదవి కోసం చాలా మంది పోటీపడుతున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ పదవిని బీసీ లేదా ఎస్సీకి ఇవ్వాలని సీఎం జగన్​ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ పదవి కోసం వైసీపీకి చెందిన ఓ సీనియర్​ నేత, ఎమ్మెల్సీ కూడా పోటీపడుతున్నట్టు సమాచారం.

అయితే త్వరలోనే ఆయన పదవీకాలం ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఆయనకు చైర్మన్ పదవి ఇవ్వాలంటే మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో కొత్త చైర్మన్​ ఎవరు? అన్న విషయంపై ఆసక్తి నెలకొన్నది. బీసీ లేదా ఎస్సీ సామాజికవర్గానికి పదవి ఇవ్వాలని సీఎం జగన్​ యోచిస్తుండగా.. మరోవైపు గతంలో మైనార్టీ సామాజికవర్గానికి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా మైనార్టీకే పదవి ఇవ్వాలన్న డిమాండ్​ కూడా వినిపిస్తున్నది.

శాసనమండలితో సీఎం జగన్ కు అధికారం చేపట్టినప్పటి నుంచి చికాకులే ఉన్నాయి. అందుకు కారణం టీడీపీకి మండలిలో మెజార్టీ ఉండటమే. దీంతో కీలక బిల్లులు మండలిలో ఆగిపోయేవి. ఈ క్రమంలో వరసగా టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుండటంతో ఆ పార్టీకి బలం తగ్గింది.

మరోవైపు ఇటీవల జరిగిన పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన కొందరు స్వతంత్రులు కూడా మండలిలో అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తొందర్లోనే వైసీపీకి మండలిలో మెజార్టీ లభించనున్నది. దీంతో కొత్త చైర్మన్​ను ఎన్నుకోనున్నారు. చైర్మన్‌ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.

First Published:  22 April 2021 11:53 AM IST
Next Story