మరో మెగా హీరోకు కరోనా
టాలీవుడ్ లో మరో హీరో కరోనా బారిన పడ్డాడు. మెగా హీరో కల్యాణ్ దేవ్ కు వైరస్ సోకింది. ఈ విషయాన్ని అతడు స్వయంగా ప్రకటించాడు కూడా. నిన్న సాయంత్రమే టెస్ట్ రిజల్ట్ అందుకున్నాడు కల్యాణ్ దేవ్. అందులో పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ సెట్స్ పైకి వస్తానని ఎనౌన్స్ చేశాడు కల్యాణ్ దేవ్. మెగా కాంపౌండ్ లో ఇప్పటికే కొంతమంది కరోనా […]
టాలీవుడ్ లో మరో హీరో కరోనా బారిన పడ్డాడు. మెగా హీరో కల్యాణ్ దేవ్ కు వైరస్ సోకింది. ఈ విషయాన్ని
అతడు స్వయంగా ప్రకటించాడు కూడా. నిన్న సాయంత్రమే టెస్ట్ రిజల్ట్ అందుకున్నాడు కల్యాణ్ దేవ్.
అందులో పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. త్వరలోనే
పూర్తి ఆరోగ్యంతో మళ్లీ సెట్స్ పైకి వస్తానని ఎనౌన్స్ చేశాడు కల్యాణ్ దేవ్.
మెగా కాంపౌండ్ లో ఇప్పటికే కొంతమంది కరోనా బారిన పడ్డారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, నాగబాబు
లాంటి వ్యక్తులు కరోనాతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కల్యాణ్ దేవ్ కూడా కొవిడ్ బారిన పడ్డాడు.
లాక్ డౌన్ తర్వాత ముందుగా సెట్స్ పైకొచ్చిన హీరోల్లో కల్యాణ్ దేవ్ ఒకడు. ఇంకా చెప్పాలంటే మెగా
కాంపౌండ్ నుంచి ముందుగా షూటింగ్స్ స్టార్ట్ చేసింది ఇతడే. ఆ తర్వాతే సాయిధరమ్ తేజ్ షూటింగ్స్
మొదలుపెట్టాడు. అప్పట్నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నప్పటికీ, వైరస్ బారిన పడ్డాడు ఈ
హీరో.