కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే ఆయనను ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే బుధవారం రాత్రి పరీక్షల కోసం కేసీఆర్‌ను సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు. కేసీఆర్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారనగానే అందరిలోనూ టెన్షన్ నెలకొన్నది. అయితే కేసీఆర్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయనకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మాత్రమే ఆస్పత్రికి తీసుకొచ్చామని వైద్యులు స్పష్టం చేశారు. […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే ఆయనను ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే బుధవారం రాత్రి పరీక్షల కోసం కేసీఆర్‌ను సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు.
కేసీఆర్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారనగానే అందరిలోనూ టెన్షన్ నెలకొన్నది. అయితే కేసీఆర్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయనకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మాత్రమే ఆస్పత్రికి తీసుకొచ్చామని వైద్యులు స్పష్టం చేశారు. పరీక్షల అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయారు. అయితే సోమాజిగూడ యశోదకు వచ్చిన సందర్భంలో సీఎం కేసీఆర్ ఆరోగ్యంగానే కనిపించారు.
ప్రస్తుతం కేసీఆర్‌కు కరోనా లక్షణాలు తగ్గిపోయాయని.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. కేసీఆర్‌కు సీటీ స్కాన్, ఇతర రక్త పరీక్షలు నిర్వహించారు. అన్ని పరీక్షలు నిర్వహించగా ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు తేలింది. మరోవైపు ఆక్సిజన్ స్థాయిలు కూడా బాగానే ఉన్నాయని వైద్యులు చెప్పారు. త్వరలోనే సీఎం కేసీఆర్ విధులకు హాజరయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
సాగర్ సభలోనే సీఎం కేసీఆర్‌కు కరోనా సోకి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 19న ఆయనకు యాంటీజెన్ పరీక్ష చేశారు. ఆ తర్వాత ఆర్టీపీసీఆర్ పరీక్ష చేశారు. అప్పుడు కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఎర్రవెళ్లిలోని ఫామ్‌హౌస్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఎప్పటికప్పుడు డాక్టర్లు ఆయన ఆరోగ్యపరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు.