Telugu Global
NEWS

కుదిరిన పొత్తు.. జనసేనకు మరీ 6 స్థానాలేనా?

తెలంగాణలో త్వరలో జరగబోతున్న మున్సిపల్​, కార్పొరేషన్​ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీచేయబోతున్న విషయం తెలిసిందే. దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో జోష్ వచ్చింది. అయితే నిజంగానే ఆ పార్టీకి తెలంగాణలో బలముందా? కేవలం కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితమైందా? అన్న విషయంపై చాలా మంది అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన సాగర్​ ఉప ఎన్నికలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదని సమాచారం. సాగర్​ ఫలితాలు రాకముందే.. కొన్ని […]

కుదిరిన పొత్తు.. జనసేనకు మరీ 6 స్థానాలేనా?
X

తెలంగాణలో త్వరలో జరగబోతున్న మున్సిపల్​, కార్పొరేషన్​ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీచేయబోతున్న విషయం తెలిసిందే. దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో జోష్ వచ్చింది. అయితే నిజంగానే ఆ పార్టీకి తెలంగాణలో బలముందా? కేవలం కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితమైందా? అన్న విషయంపై చాలా మంది అనుమానాలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన సాగర్​ ఉప ఎన్నికలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదని సమాచారం. సాగర్​ ఫలితాలు రాకముందే.. కొన్ని మున్సిపల్​, కార్పొరేషన్​ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్​ వచ్చేసింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీచేయబోతున్నాయి. ఇప్పటికే ఖమ్మం కార్పొరేషన్​ కు రెండు పార్టీలకు పొత్తు కుదిరింది. ఖమ్మం కార్పొరేషన్​ పరిధిలో మొత్తం 60 స్థానాలుండగా.. బీజేపీ 54 స్థానాల్లో జనసేన 6 స్థానాల్లో పోటీచేయబోతున్నదట.

అయితే తమకు కేవలం 6 స్థానాలే ఇవ్వడం ఏమిటని జనసైనికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఈ మాత్రం దానికి పొత్తు అని ఓ పేరు పెట్టడం దేనికి అని వాళ్లు ప్రశ్నిస్తున్నారట. తెలంగాణలో జనసేనకు పెద్దగా బలం లేదు. ఆ మాటకొస్తే బీజేపీ పరిస్థితి కూడా అంతే. చాలా గ్రామాల్లో బీజేపీకి అసలు కమిటీలు కూడా ఉండవు. కేవలం నగర ప్రాంతాల్లో మాత్రమే ఆ పార్టీ ప్రభావం ఉంటుంది. అందుకే జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలు గెలుపొందింది.

అయితే దుబ్బాకలో గెలవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్​రావు. అప్పటికే ఆయన రెండు సార్లు ఓడిపోయి ఉండటం, దానికి తోడు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాక మంచి వాక్చాతుర్యం ఉన్న నేత. దీంతో దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్​రావు గెలుపొందారు.

ఇక సాగర్​లో వచ్చే ఫలితాన్ని బట్టి ఆపార్టీ బలం ఎంతో తెలిసిపోతుంది. జనసేన కూడా తెలంగాణలో బలంగా ఏమీ లేదు. కానీ పవన్​ కల్యాణ్​కు రెండు రాష్ట్రాల్లో ఫ్యాన్స్​ ఉంటారు. కాబట్టి తెలంగాణలోని అన్ని నియోజవర్గాల్లో ఆ పార్టీ పోటీచేస్తే కొంత ఓటింగ్​ పర్సెంటేజ్​ రావచ్చు. అయితే ఖమ్మంలో మరీ తమకు ఆరు స్థానాలు ఇవ్వడం ఏమిటని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.

First Published:  22 April 2021 12:16 PM IST
Next Story